హైదరాబాద్, ఉప్పల్ స్టేడియం వేదికగా ఆదివారం భారత్ – ఆస్ట్రేలియా చివరి టీ20 మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. రాత్రి ఏడుగంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆదివారం సెలవు కావడం.. సిరీస్‌ను తేల్చే మ్యాచ్ కావడంతో.. టికెట్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. కరోనా కారణంగా గత కొంత కాలంగా స్టేడియంలో కూర్చొని అంతర్జాతీయ మ్యాచ్‌లు వీక్షించే అవకాశం కూడా లేకుండా పోయింది. మూడేళ్ల తర్వాత.. అందునా.. ఇండియా-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ కావడంతో.. టికెట్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీన్ని కొందరు కేటుగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. 850 రూపాయల టికెట్‌ను ఏకంగా 11 వేలకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు బ్లాక్ టికెట్ల ముఠాను అదుపులోకి తీసుకుంది. ఆ వివరాలు..
ఉప్పల్ స్టేడియం సమీపంలో బ్లాక్ టికెట్లు అమ్ముతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేడియంకు సమీపంలో.. గగులోత్ వెంకటేష్, ఇస్లావత్ దయాకర్‌చ గగులోత్ అరుణ్ అనే ముగ్గురు వ్యక్తులు టికెట్లను బ్లాక్‌లో అమ్ముతుండగా.. ఎల్బీ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు 850 రూపాయల విలువైన టికెట్‌ను ఏకంగా 11 వేల రూపాయలకు విక్రయిస్తున్నారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. నిందితుల వద్ద నుంచి ఆరు టికెట్లు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Hyderabad: Three persons were arrested selling tickets in a block near Uppal Stadium.. While selling a ticket of Rs.850 for Rs.11 thousand, SWOT police arrested three persons namely Venkatesh, Dayakar and Arun.. 6 tickets and 3 cell phones were seized.#Hyederabad #INDvsAUST201 pic.twitter.com/DTqGSWEQdt
— TRN NEWS (@TodaysTrn) September 25, 2022