హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. వరుసకు సోదరుడు అయ్యే వ్యక్తి 8 నెలల గర్భిణి మహిళపై కిరాతకానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. సోదరుడు వరుసయ్యే వ్యక్తి ఆ నిండు గర్భిణిపై ఏం చేశాడు? అంతలా దారి తీసిన పరిస్థితులు ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ కొండాపూర్ లోని జేవీజీహీల్స్ లో వెంకట రామకృష్ణ, స్రవంతి(32) అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. భర్త వెంకట రామకృష్ణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
ఇదిలా ఉంటే స్రవంతి చిన్నమ్మ కూతురైన లక్ష్మీప్రసన్నకు వెంకట రామకృష్ణ, స్రవంతి దంపతులు మధ్యవర్తిగా ఉండి పశ్చిమ గోదావరి జిల్లా పేరుపాలెం గ్రామానికి చెందిన శ్రీరామకృష్ణతో 2020లో వివాహం జరిపించారు. గత కొంత కాలం నుంచి వీళ్లు కూడా హైదరాబాద్ లోనే నివాసం ఉంటున్నారు. అయితే పెళ్లైన కొన్ని రోజుల వరకే ఈ దంపతులు సంతోషంగా జీవించారు. కానీ రోజులు గడిచే కొద్ది లక్ష్మీప్రసన్న భర్త శ్రీరామకృష్ణ అనేక రకాలుగా భార్యను వేధించడం మొదలు పెట్టాడు. భర్త పోరును భరించలేని లక్ష్మీప్రసన్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఈ దంపతులకు కౌన్స్ లింగ్ ఇచ్చి పంపించారు. అయినా మనోడి ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రాలేదు. ఇలా అయితే కాదని భావించిన వెంకట రామకృష్ణ, స్రవంతి దంపతులు శ్రీరామకృష్ణ స్వగ్రామానికి వెళ్లి వారి పెద్దలతో పంచాయితీ పెట్టించారు.
దీంతో అప్పటి నుంచి లక్ష్మీ ప్రసన్న భర్త శ్రీరామకృష్ణ వెంకట రామకృష్ణపై పగ పెంచుకున్నాడు. నా సంసారాన్ని బయటకు లాగిన నిన్ను వదిలేది లేదంటూ కోపంతో ఊగిపోయాడు. ఇక ఇంతటితో ఆగని శ్రీరామకృష్ణ ఎలాగైన వెంకట రామకృష్ణను హత్య చేయాలని అనుకున్నాడు. ఇందులో భాగంగానే ఈ నెల 6న వెంకట రామకృష్ణ, స్రవంతి దంపతులు ఉంటున్న ఇంటికి శ్రీరామకృష్ణ వేట కొడవళ్లతో వెళ్లాడు. అతనిని చూసిన స్రవంతి భయంతో అరుపులు కేకలు వేస్తూ జనాలందరినీ పలిచే ప్రయత్నం చేసింది.
దీంతో కోపంతో ఊగిపోయిన శ్రీరామకృష్ణ అడ్డుకోబోయిన 8 నెలల గర్భిణి అయిన స్రవంతి తన చేతిలో ఉన్న వేటకోడవళ్లతో దారుణంగా పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే గమనించిన స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరించారు. ఇక చికిత్స పొందుతూ స్రవంతి ప్రాణాలు కోల్పోయింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. నిండు గర్భిణి అని చూడకండా వేటకొడవళ్లతో దారుణంగా పొడిచి చంపిన ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.