అన్నమయ్య జిల్లాలో పెళ్లింట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శోభనం రాత్రే బెడ్ రూంలోకి నవ వరుడు మృతి చెందాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అన్నమయ్య జిల్లా పాకల మండలం కట్టకిందపల్లి. ఇదే గ్రామానికి చెందిన తులసి ప్రసాద్ అనే యువకుడికి మదనపల్లికి చెందిన శిరీష అనే యువతితో కటుంబ సభ్యులు పెళ్లి చేయాలని నిశ్చయించారు. సోమవారం ఇరువురి కుటుంబ సభ్యుల మధ్య వీరి పెళ్లి ఘనంగా జరిగింది. పెళ్లికి వచ్చిన బంధువులు నూతన వధువరులను ఆశీర్వదించారు.
ఇక పెళ్లి తంతులో భాగంగా కుటుంబ సభ్యులు నూతన వధువు, వరుడికి మంగళవారం రాత్రి శోభనం ఏర్పాటు చేశారు. ఇక అందరూ అనుకున్నట్లుగానే రాత్రి వరుడు, వధువు బెడ్ రూంలోనే ఉన్నారు. ఇక బుధవారం ఉదయం వరుడు శోభనం గది నుంచి ఎంతకు బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం కలిగింది. వెంటనే ఆ శోభనం గదిలోకి వెళ్లి చూడగా వరుడు బెడ్ పై చనిపోయి కనిపించాడు. ఈ సీన్ ను చూసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు విలిపించారు.
పెళ్లి జరిగిన ఓ రోజు గడిచిందో లేదో అప్పుడే నవ వరుడు మరణించడంతో పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదే అంశం స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. వరుడు తులసి ప్రసాద్ మరణానికి కారణం ఏంటనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పెళ్లైన ఒక రోజుకే వరుడు మరణించిన ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.