హైదరాబాద్ లో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. ఓ గుర్తు తెలియని యువకుడిని కొందరు దుండుగులు చంపి తగలబెట్టారు. రేపు అమవాస్య, సూర్య గ్రహణం కావడంతో బలి ఇచ్చి ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని శవాన్ని పరిశీలించారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. పోలీసుల కథనం ప్రకారం.. KPHB హైదర్ నగర్ లోని ఓ ప్రాంతంలో యువకుడి కొట్టి హత్య చేశారు. దీంతో అతని అనవాళు గుర్తుపట్టలేనంతగా తగలబెట్టారు.
ఇదే కాకుండా అతని శవం పక్కన కుంకుమ, పసుపులతో పూజలు చేసి ఉండడంతో మరింత అనుమానాలకు దారి తీస్తోంది. దీనిని చూసిన స్థానికులు ఒక్కసారిగా భయందోళనకు గురయ్యారు. ఇది పక్కా క్షుద్రపూజలే అంటూ బెంబేలిత్తిపోయారు. ఇక రేపు అమవాస్యతో పాటు సూర్యగ్రహణం కూడా కావడంతో మరింత అనుమానాలకు తావిస్తుంది. వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని శవాన్నిపరిశీలించారు.
గుర్తుతెలియని దుండగులు యువకుడిని హత్య చేసి పూర్తిగా తగలబెట్టారు. క్షుద్రపూజల నేపథ్యంలోనే ఇదంతా జరిగినట్లుగా పోలీసులు సైతం అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అసలు ఇది హత్యనా? లేక క్షుద్రపూజల కారణంగా యువకుడిని బలి ఇచ్చారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇక రేపు అమవాస్య, సూర్యగ్రహణం కావడంతో స్థానికులు భయందోళనలకు గురవుతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారుతోంది.