కేరళకు చెందిన ఫార్మసిస్ట్ విష్ణుప్రియ హత్య కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. నిందితుడు శ్యామ్‌జిత్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలు సంచలన విషయాలు వెలుగు చూశాయి. ప్రియుడు శ్యామ్‌జిత్ విష్ణుప్రియను చంపటానికి తనతో కత్తితో పాటు సుత్తిని కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెపై కత్తితో దాడి చేశాడు. గొంతు కోయటంతో పాటు ఆమె శరీరంపై 18 లోతైన గాయాలు చేశాడు. చనిపోయే ముందు ఆమె శ్యామ్‌జిత్, శ్యామ్‌జిత్ అని అరిచినట్లు సమాచారం.
విష్ణుప్రియ మరణానికి గల కారణాలు పోలీసులకు మొదట తెలియలేదు. ఆమె ఫోన్ కాల్ లిస్ట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆఖరి ఫోన్ కాల్ మాట్లాడిన అజిత్‌పై పోలీసులకు అనుమానం వచ్చింది. హత్య జరిగిన సమయంలో తాము ముసుగు ధరించిన వ్యక్తిని చూశామని స్థానికులు పోలీసులకు చెప్పారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అజిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని విచారించగా అసలు విషయం తెలిసింది. బ్రేకప్ భరించలేకే ఆమెపై దాడి చేసినట్లు శ్యామ్‌జిత్ తెలిపాడు. కాగా, కేరళ, కన్నూర్ జిల్లాలోని పనూర్‌కు చెందిన విష్ణుప్రియ మనతేరి ప్రాంతానికి చెందిన శ్యామజిత్ ప్రేమికులు.
ఇద్దరి మధ్యా మనస్పర్థల కారణంగా కొన్ని నెలల క్రితం విష్ణుప్రియ, శ్యామజిత్‌కు బ్రేకప్ చెప్పింది. ఇక, అప్పటినుంచి అతడికి దూరంగా ఉంటోంది. విష్ణుప్రియ తనకు దూరం అవ్వటం శ్యామ్‌జిత్ తట్టుకోలేకపోయాడు. ఆమెకు నచ్చజెప్పటానికి ఎంతో ప్రయత్నించాడు. అయినా ఆమె ఒప్పుకోకపోవటంతో ఆమెపై పగ పెంచుకున్నాడు. శనివారం విష్ణు ప్రియ ఇంట్లో వారందరూ చావు ఇంటికి వెళ్లారు. ఆమె ఒక్కత్తే ఇంట్లో ఉంది. విష్ణు ప్రియ ఒక్కత్తే ఇంట్లో ఉందని గుర్తించిన శ్యామజిత్ నేరుగా ఆమె బెడ్ రూమ్‌లోకి వెళ్లాడు. కత్తితో అతి క్రూరంగా ఆమెపై దాడి చేసి చంపాడు.