సంపాదించడానికి రెండు దారులు ఉంటాయి. ఒకటి ఒళ్లు ఒంచి కష్టపడి, నిజాయితీగా సంపాదించడం.. రెండు ఎదుటివారి మోసంచేస్తూ, వారి జీవితాలతో ఆడుకుంటూ డబ్బు సంపాదించేయడం. అలా ఎదుటివారి జీవితాలు నాశనం చేస్తూ డబ్బు సంపాదించడానికి అలావాటు పడిన ఓ కిలాడీ లేడీని పోలీసులు అరెస్టు చేశారు. వస్త్రా దుకాణం నడుపుతూ మాయమాటలు చెప్పి యువతులను వ్యభిచార కూపంలోకి దింపుతున్నట్లు విజయవాడ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదులు రాగా.. దర్యాప్తు జరిపించి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఆమె చేసిన అరాచకాల గురించి మొత్తం వివరాలను సేకరించే పనిలో ఉన్నారు.
వివరాల్లోకి వెళ్తే.. గురు నాగసాయి అనే మహిళకు విజయవాడ పడమట లంకలో ఓ వస్త్ర దుకాణం ఉంది. అయితే అక్కడకు వచ్చే యువతులు, స్త్రీలతో నాగసాయి పరిచయం ఏర్పాటు చేసుకుంటూ ఉంటుంది. అలా వారితో పరిచయం పెరిగిన తర్వాత వారిని కిట్టీ పార్టీలకు ఆహ్వానిస్తూ ఉంటుంది. అలా ఎవరైనా పార్టీకి వారి ఇంటికి వస్తే.. కూల్ డ్రింక్స్ లో మద్యం కలిపి ఇస్తుంది. కొందరికైతే నేరుగానే మద్యం తాగడం అలవాటు చేస్తుంది. అలా వాళ్లు మద్యం తాగి స్పృహ కోల్పోతే వారి నగ్న చిత్రాలను తీస్తూ ఉంటుంది. అంతేకాకుండా వస్త్ర దుకాణంలో ఎవరైనా డ్రెస్ ఛేంజ్ చేసుకున్నా నగ్న చిత్రాలు తీస్తుందని చెబుతున్నారు. ఆమె తీసిన ఫొటోలను అడ్డుగా పెట్టుకుని యువతులను బెదిరిస్తుందని ఆరోపణలు వస్తున్నాయి.
ముందుగా మంచిగా మాట్లాడి యువతులను వ్యభిచార కూపంలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఒకవేళ ఎవరైనా ఆమె మాట వినకపోతే వారిని బెదిరిస్తుంది. వారి నగ్న చిత్రాలను చూపిస్తూ చెప్పింది వినకపోతే వీటిని లీక్ చేస్తానంటూ బెదిరింపులకు దిగుతుందట. అలా బలవంతంగా యువతులను వ్యవభిచార కూపంలో దింపడం చేస్తుంటుంది. విటులకు కూడా యువతుల నగ్న చిత్రాలను పంపి బేరసారాలు కుదుర్చుకుంటుందట. ఈమె ఆగడాల గురించి విజయవాడ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదులు అందడంతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు జరిపించారు. ఆమెపై వచ్చిన ఆరోపణలు నిజమని నిర్ణయానికి వచ్చి కేసు నమోదు చేసి గురునాగసాయిని అదుపులోకి తీసుకున్నారు.