బంగారం కొనాలనుకునేవారికి ఇది సువర్ణావకాశం. గత మూడు రోజులుగా చూసుకుంటే బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
పసిడి ప్రియులకు కాస్త ఊరట కలిగించేలా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. మూడు రోజులుగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. ప్రస్తుతం అంటే ఉదయం 9.40 గంటలకు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1999.45 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుండగా.. ఔన్సు వెండి ధర 25.03 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. గడిచిన పది రోజుల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయన్నది పరిశీలిస్తే.. ఏప్రిల్ 9న 24 క్యారెట్ల బంగారం రూ. 60,860 ఉండగా ఏప్రిల్ 10న రూ. 430 తగ్గి రూ. 60,430 గా ఉంది. ఏప్రిల్ 11, 12 తేదీల్లో ఏకంగా రూ. 800 పెరుగుదలతో రూ. 61,310 కి చేరుకుంది. ఏప్రిల్ 13న రూ. 110 తగ్గితే.. ఏప్రిల్ 14న రూ. 600 పెరిగింది.
ఏప్రిల్ 15 నుంచి మాత్రం వరుసగా పతనమవుతూ వస్తుంది. ఏప్రిల్ 15న 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల వద్ద ఏకంగా రూ. 760 తగ్గింది. ఏప్రిల్ 16న రూ. 10 తగ్గింది. నిన్న ఎలాంటి మార్పు లేదు కానీ ఇవాళ ఉదయానికి రూ. 10 తగ్గింది. దీంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల వద్ద రూ. 61,020 వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల బంగారం ఏప్రిల్ 9న రూ. 55,790 ఉండగా.. ఏప్రిల్ 10న రూ. 390 తగ్గింపుతో రూ. 55,400 ఉంది. ఏప్రిల్ 11, 12 తేదీల్లో రూ. 800 పెరుగుదలతో రూ. 56,200 కి చేరుకున్న బంగారం ఏప్రిల్ 13న రూ. 100 తగ్గుదలతో రూ. 56,100కి చేరుకుంది. ఏప్రిల్ 14న ఏకంగా రూ. 550 పెరుగుదలతో రూ. 56,650కి చేరుకుంది. ఏప్రిల్ 15 నుంచి ఇప్పటి వరకూ రూ. 720 తగ్గింది.
ఈ మూడు రోజులుగా మళ్ళీ బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,930 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధరలు విషయానికొస్తే వెండి ఎక్కడా రాజీ పడడం లేదు. గడిచిన 10 రోజుల్లో 5 సార్లు పెరిగింది. ఏకంగా రూ. 3100 పెరిగింది. అయితే రెండు సార్లు మాత్రం వెండి ధర తగ్గింది. కేవలం రూ. 1700 తగ్గింది. నిన్న కిలో వద్ద రూ. 100 పెరిగింది. ఇవాళ కిలో వెండి ధర రూ. 81,600 వద్ద కొనసాగుతోంది. వెండి ధరల్లో పెద్దగా మార్పులు ఉండవని.. బంగారం మాత్రం తగ్గే అవకాశం ఉందని.. కొనుక్కునేందుకు ఇదే మంచి అవకాశమని నిపుణులు చెబుతున్నారు. అయితే అక్షయ తృతీయ రోజున మాత్రం భారీగా పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు.