గత కొంతకాలంగా చుక్కలను తాకిన బంగారం ధర.. వరుసుగా మూడు రోజులుగా దిగి వస్తోంది. అలానే వెండి ధర కూడా భారీగా పతనవుతూ వస్తోంది. మరి నేడు వెండి, బంగారం ధర ఎంత మేర తగ్గింది అంటే..
బంగారం అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. పైగా మన భారతీయ మహిళలకు పసిడి అంటే ఎంతో ఇష్టం. జీవితంలో ఎంతో కొంత బంగారం కొనాలని ఆశపడతారు. అందుకే పండగలు, ప్రత్యేక పర్వదినాలు, వివాహాది శుభకార్యాల సందర్భంగా.. ఎంతో కొంత బంగారం కొంటుంటారు. ఇక పెళ్లికి బంగారం కచ్చితంగా ఉండాల్సిందే. ఎంత పేదవారైనా సరే.. ఆడపిల్ల పెళ్లి కోసం బంగారం కొంటారు. అయితే గత కొంత కాలంగా బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది అక్షయ తృతీయ సందర్భంగా పసిడికి డిమాండ్ భారీగా పెరిగింది. దీనికి తోడు ధర కూడా అలానే పెరగడంతో.. చాలా మంది బంగారం కొనాలంటే.. భయపడ్డారు. అయితే అక్షయ తృతీయ తర్వాత అనూహ్యంగా బంగారం, వెండి ధరలు వరుసగా పతనమవుతున్నాయి. ఇక నేడు కూడా బంగారం ధర తగ్గింది. ఇక మంగళవారం అంతర్జాతీయంగా, దేశంలోని వివిధ నగారాల్లో బంగారం ధర ఎంత తగ్గింది అంటే…
నేడు అనగా మంగళవారం నాడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ బంగారం ధర వరుసగా మూడో రోజు కూడా దిగివచ్చింది. ఇవాళ 22 క్యారెట్ బంగారం ధర 10 గ్రాముల మీద 70 రూపాయలు తగ్గింది. ఇక ఇవాళ 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల ధరరూ.55,650 గా ఉంది. అలానే 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర కూడా తగ్గింది. నేడు 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ.80 తగ్గింది. ప్రస్తుతం 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.60,710 పలుకుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా 22 క్యారెట్ గోల్డ్ ధర 10 గ్రాముల మీద రూ.100 మేర తగ్గి.. రూ.55,750 పలుకుతోంది. అలానే 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర రూ.80 మేర దిగివచ్చి ప్రస్తుతం రూ.60,860 మార్క్ వద్ద ఉంది.
ఇక వెండి కూడా బంగారం ధరలోనే దిగి వస్తోంది. ఇటీవల కిలో వెండి రేటు రూ.81 వేలు దాటిన విషయం తెలిసిందే. అయితే గడిచిన మూడు రోజుల్లో కిలో వెండి మీద ఏకంగా రూ.1300 మేర తగ్గడం ఊరట కలిగిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రేటు రూ.400 తగ్గి రూ.80 వేల వద్ద ట్రేడవుతోంది. అలానే దేశ రాజధాని ఢిల్లీలో చూసుకుంటే కిలో వెండి రేటు రూ.500 మేర తగ్గి ప్రస్తుతం రూ.76,400 పలుకుతోంది. ఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్‌లో బంగారం ధర కాస్త తక్కువగా ఉంటుంది. వెండి రేటు ఎక్కువగా ఉంటుంది. ట్యాక్సుల కారణంగా ధరల్లో వ్యత్యాసం కనిపిస్తుంది.
దేశీయంగా వెండి, బంగారం ధరలు దిగి వస్తే.. అంతర్జాతీయంగా మాత్రం ఈ రేట్లు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ఔన్సుకు 1999 డాలర్లు పలుకుతోంది. ఇటీవలి కాలంలో ఇది 1800 డాలర్లకు పడిపోయిన విషయం తెలిసిందే. ఇక స్పాట్ వెండి రేటు ఔన్సుకు 25.29 డాలర్లుగా ఉంది.