దిగ్గజ సంస్థ టాటా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గుండు సూది నుంచి కారు వరకు దాదాపు అన్నింటిని సామాన్యుడికి టాటా సంస్థ అందించింది. కారు గురించి సామాన్యుడు ఆలోచిండానికి కూడా అవకాశం ఉండని రోజుల్లోనే.. ‘నానో’ ఆలోచనతో సామాన్యుడు కూడా కారులో తిరిగేలా టాటా సంస్థ చేసింది. ఇలా దాదాపు ప్రతిరంగంలోనూ అడుపెట్టి..తనదైన ముద్ర వేసింది టాటా సంస్థ. తాజాగా టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి అడుగుపెట్టింది. తక్కువ ఖర్చుతో మధ్యతరగతి వారు ప్రయాణించేలా ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేస్తోంది.
గతంలో సామాన్యుడు సైతం కార్లు ప్రయాణించేందుకు నానో కారును టాటా సంస్థ రూపొందించింది. అప్పట్లో అదో పెద్ద సంచలనమే. పెరుగుతున్న ఇంధన ధరలకు సామాన్యులు అల్లాడిపోతున్నారు. వారి ప్రయాణ కష్టాలు తొలగించేలా ఎలక్ట్రిక్ వాహనాలను టాటా సంస్థ ప్రారంభిస్తోంది. అంతే కాక తక్కువ ఖర్చుతో మధ్యతరగతి కుటుంబమంతా కలిసి ప్రయాణాలు చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. టాటా టియాగో ఈవీ అనే కారును ఈ సంస్థ లాంచ్ చేసింది. ఆక్టోబర్ 10 నుంచి ఈ కార్ల బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ టియాగో ఈవీ టాటా మోటర్స్ నుంచి మార్కెట్లోకి విడుదలైన మూడవ ఎలక్ట్రిక్ కారు ఇదే. నెక్సాన్ ఈవీ, టిగోర్ ఈవీ గతంలో మార్కెట్లోకి రాగా.. ఇప్పుడు వీటికి కంటే తక్కువ ధరతో టియాగో ఈవీని కంపెనీ పరిచయం చేసింది. ఈ కొత్త కారు ప్రయాణాల ఖర్చు చాలా తక్కువగా ఉంటుందని కంపెనీ అధికారులు అంటున్నారు.
ఇంధనాలతో నడిచే వాహనాలతో పోల్చితే ఈ కారు కిలోమీటరకు రూ.6.50 వరకు డబ్బులను ఆదా చేస్తోందని కంపెనీ అధికారులు చెబుతున్నారు. మాములుగా పెట్రోలో కారుతో 1000 కిలోమీటర్లు ప్రయాణించడటానికి దాదాపు రూ. 8000 ఖర్చు అవుతోందని అదే ఈ టాటా టియాగో ఎలక్ట్రిక్ కారు అయితే కేవలం రూ.1,100 ఖర్చు అవుతుందని ఆ కంపెనీ ఒక డేటా ద్వారా తెలిపింది. ఈ టియాగో ఈవీ కి 1000 కి.మీ దూరానికి రూ.1000 మాత్రమే ఖర్చు వస్తుంది. ఆ లెక్కన కిలో మీటర్ కి ఒక రూపాయి మాత్రమే ఖర్చు అవుతుందని తెలుస్తోంది. నేటి కాలంలో బైక్ పై ప్రయాణించే వారే కిలోమీటర్ కి 2-4 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. అలాంటిది ఈ కారుకి కిలో మీటర్ కి కేవలం రూపాయి మాత్రమే ఖర్చు కావడంతో టాటా కంపెనీ వినియోగదారులన నుంచి ప్రశంసలు అందుకుంటోంది. కొనుగోలు దారులు టియాగో ఈవీ ని టాటా మోటర్స్ డీలర్ షిప్స్ లేదా టాటా వెబ్ సైట్ లో రూ.21 వేల డిపాజిట్ చేసి బుక్ చేసుకోవచ్చు.
డెలివరీలు మాత్రం జనవరి 2023 నుంచి ప్రారంభమవుతాయి. ఇక ఈ కారును డిసెంబర్ నుంచి టెస్ట్ డ్రైవ్ లకు అనుమతి లభిస్తుంది. ఈ కారు ప్రారంభ ధర రూ.8.49 లక్షల ఉంటే..గరిష్ఠ ధర రూ.11.79 లక్షల వరకు ఉంటుంది. ఇక ఈ కారు ఫిచర్ల విషయానికి వస్తే.. ఐపీ67 రేటెడ్ 24kWH బ్యాటరీ , సింగిల్ ఛార్జ్ పై 315 కి.మీ రేంజ్ అందించారు. ఈ కారు మోటార్, బ్యాటరీలకు 8 ఏళ్లు వారంటీ ఉంటుంది. కేవలం గంటలోనే 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ప్రస్తుతం ఈ కారు గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎప్పుడెప్పుడు బయటకి వస్తుందా అని కార్ల ప్రియులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
Need we say more? The Tiago.ev comes loaded with features that will surely make you go.ev!
Bookings start from 10th October, 2022.
Know more: https://t.co/YfFYgiIeQx#Tiagoev #EvolveToElectric pic.twitter.com/EsIVJY5BzH
— Tata Passenger Electric Mobility Limited (@Tatamotorsev) October 6, 2022
ఇదీ చదవండి: అదనపు ఛార్జెస్ లేకుండా వస్తువులు కొంటున్నారా? నో కాస్ట్ EMI అసలు మతలబు ఇదే!
ఇదీ చదవండి: మీకు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉన్నాయా? అయితే నష్టపోయినట్లే..!