Samsung Credit Card: శాంసంగ్.. భారతీయులకు పరిచయం అక్కర్లేని పేరు. పేరుకు దక్షిణకొరియా సంస్థ అయినా భారతీయులు అధికంగా ఇష్టపడుతున్న కంపెనీ శాంసంగ్. స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మెషిన్లు.. ఇలా అన్ని రకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో పేరు ప్రఖ్యాతులు పొందిన సంస్థ. ఈ దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం తాజాగా క్రెడిట్ కార్డు బిజినెస్ లోకి ఎంటరైంది. ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ‘యాక్సిస్’, ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థ ‘వీసా’తో కలిసి క్రెడిట్ కార్డు జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. అందులో భాగంగా ప్రారంభ ఆఫర్ కింద భారీ ఆఫర్లు ప్రకటించింది.
వీసా సిగ్నేచర్, వీసా ఇన్ఫినిటీ.. రెండు వేరియంట్లలో ఈ కార్డు అందుబాటులో ఉంటుంది. ఈ క్రెడిట్ కార్డుతో కస్టమర్లు అన్ని రకాల శాంసంగ్ ఉత్పత్తులపై 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందొచ్చు. ప్రస్తుతం శాంసంగ్ అందిస్తోన్న ఆఫర్లకు అదనంగా ఈ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డు ద్వారా మరో 10 శాతం క్యాష్‌బ్యాక్ అదనంగా పొందవచ్చన్నమాట. అన్ని ఈఎంఐ, నాన్-ఈఎంఐ కాని లావాదేవీలపై ఈ క్యాష్‌బ్యాక్ వర్తిస్తుంది. అలాగే.. కొనుగోలుపై ఎలాంటి కనీస లావాదేవీ పరిమితి లేదు. చిన్న శాంసంగ్ వస్తువు కొన్నా కూడా 10 శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు.
The new Samsung Axis Bank Credit Card is here and is set to change the game. Now get up to 10% cashback* across Samsung products and services, festival or no festival. Applicable above all offers. Get notified today, so even you can go #TenTenTen. *T&C apply. #Get10withSamsung
— Samsung India (@SamsungIndia) September 26, 2022
శాంసంగ్ క్రెడిట్ కార్డు.. వీసా సిగ్నేచర్, వీసా ఇనిఫినిటీ అనే పేర్లతో రానుంది. వీసా సిగ్నేచర్ కార్డుపై నెలవారీగా రూ.2,500తోపాటు ఏడాదిలో రూ.10 వేల వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ పొందొచ్చు. అలాగే.. వీసా ఇనిఫినిటీ కార్డుపై నెలవారీగా రూ.5000తోపాటు ఏడాదిలో రూ.20 వేల వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ పొందొచ్చు. రెండు కార్డులపై కనీస మొత్తం లావాదేవీలపై ఎలాంటి పరిమితుల్లేవు. ప్రతి కొనుగోలుపైనా రివార్డు పాయింట్లు పొందొచ్చు. ఫ్యూయల్ సర్‌చార్జీ మాఫీ, ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్, రెస్టారెంట్లలో డైనింగ్ ఆఫర్లు కూడా ప్రారంభ ఆఫర్ కింద లభిస్తాయి. సిగ్నేచర్ క్రెడిట్ కార్డు యాన్యువల్ ఫీ రూ.500కాగా, ఇనిఫినిటీ కార్డు యాన్యువల్ ఫీ రూ.5000గా ఉంది.
With the new Samsung Axis Bank Credit Card, you not only get up to 10% cashback*, but also enjoy exclusive benefits like complimentary airport lounge access, EDGE rewards and more. Get notified now to #Get10WithSamsung.
Know more: https://t.co/FDabHrfuiG. *T&C apply. pic.twitter.com/IIMIWGCPd5— Samsung India (@SamsungIndia) September 26, 2022