ప్రపంచంలో అత్యంత సంపన్నులు ఎవరంటే.. మొన్నటిదాకా.. జెఫ్ బెజోస్, ఎలోన్ మస్క్ అనే పేర్లే వినపడేవి. సంపన్నుల దేశంగా పేరొందిన అమెరికాలో ఇవి కామన్ కదా అని మనమూ పట్టించుకునే వాళ్ళం కాదు. కానీ, ఇప్పుడు ఈ జాబితాలోకి ఒక భారతీయుడు చేరారు. ఆయనే.. అదానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత.. ‘గౌతమ్ అదానీ’. అమెజాన్ బాస్.. జెఫ్ బెజోస్ ను వెనక్కి నెట్టి రెండో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ఎలోన్ మస్క్ మొదటి ప్లేస్ లో ఉండగా, అదానీ రెండో స్థానంలో ఉన్నారు.బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ప్రస్తుతం గౌతమ్ అదానీ ఆస్తి విలువ 147 బిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో రూ. 12.37 లక్షల కోట్లు. అంతటి సంపన్నుడైన గౌతమ్ అదానీ వద్ద లగ్జరీ కార్లతో పాటు ప్రైవేట్ జెట్ విమానాలు, హెలికాఫ్టర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన గ్యారేజ్‌లో ఉండే కొన్ని ప్రముఖ కార్లు ఏవో ఈ కథనంలో చూద్దాం..
కోట్ల రూపాయల విలువ చేసే ఇలాంటి ఖరీదైన కారు కలిగి ఉండాలంటే, వారు తప్పనిసరిగా కోటీశ్వరులే అయి ఉండాలి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లను తయారు తయారు చేసే రోల్స్ రాయిస్, గౌతమ్ అదానీ కోసం ప్రత్యేకంగా ఈ కారును తయారు చేసింది. ఆయన కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే ఈ కారును ఉపయోగిస్తారు. ఇది స్టాండర్డ్ రోల్స్ రాయిస్ ఘోస్ట్ కాదు, అదానీ కోసం ప్రత్యేకంగా కస్టమైజ్ చేయబడిన స్పెషల్ కారు.
బిలియనీర్ కార్ కలెక్షన్లో ఫెరారీ కారు లేకపోతే, అది అసంపూర్ణంగానే కనిపిస్తుంది. అందుకే, గౌతమ్ అదానీ తన గ్యారేజ్‌లో అత్యంత పాపులర్ అయిన ఇటాలియన్ కార్ ఫెరారీ కాలిఫోర్నియాను చేర్చుకున్నారు. ఎప్పుడైనా సరదా కోసం ఆయన ఈ కారును ఉపయోగిస్తుంటారని తెలుస్తోంది.
గౌతమ్ అదానీ గ్యారేజ్‌లో అనేక బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ కార్లు ఉన్నట్లు సమాచారం. ఈ కలెక్షన్‌ను చూస్తుంటే ఆయన బిఎమ్‌డబ్ల్యూ బ్రాండ్‌కి ఓ పెద్ద అభిమాని అని తెలుస్తోంది. సమాచారం ప్రకారం, అతని వద్ద బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్ యొక్క అనేక టాప్-ఎండ్ వేరియంట్లు ఉన్నాయట. ఆయన ఈ కార్లను తరచూ ఉపయోగిస్తుంటారట. చాలా సందర్భాలలో ఈ బ్రాండ్ కార్లలో కనిపించారు కూడాను.
జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ ఆడి, మనదేశంలో విక్రయిస్తున్న ఎస్యూవీ లైనప్‌లో కెల్లా అత్యంత ఖరీదైనది, విలాసవంతమైనది.. ఆడి క్యూ7. ఆడి క్యూ3, క్యూ5 తర్వాత సెలబ్రిటీలు ఎక్కువుగా ఇష్టపడే కార్లలో క్యూ7 ఒకటి. ఇదొక విశాలమైన, విలాసవంతమైన లగ్డరీ ఎస్యూవీ. ఇది నగర ప్రయాణాలకు చాలా అనుకూలంగా ఉంటుంది. దీనిని ఆయన ఎక్కువుగా ఉపయోగిస్తుంటారని తెలుస్తోంది.
ఇకపోతే.. అదానీకి కార్ల కంటే విమానాలంటేనే చాలా ఇష్టం అని తెలుస్తోంది. ఆయన కలెక్షన్లో మూడు ప్రైవేట్ జెట్లు ఉన్నాయి. అవి మూడు.. ఎంబ్రేయర్ లెగసీ 650, బొంబార్డియర్ ఛాలెంజర్ 605 మరియు బీచ్‌క్రాఫ్ట్ 850ఎక్స్‌పి. ఇవి కాకుండా అదానీ వద్ద మూడు హెలికాప్టర్లు కూడా ఉన్నాయి. అందులో ఒకటి అగస్టావెస్ట్‌ల్యాండ్ ఏడబ్ల్యూ139 హెలికాప్టర్. ఈ విషయంపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.