ఓలా.. ఈ పేరు నిత్యం వింటూనే ఉంటారు. ఓలా ఆటో, ఓలా క్యాబ్, ఓలా బైక్ అంటూ రోజూ వీటి సేవలను వినియోగుంచుకుంటూనే ఉంటారు. అయితే ఓలా కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీలో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఓలా ఎస్1, ఓలా ఎస్1 ప్రో అంటూ రెండు మోడళ్లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ రెండు మోడళ్ల విక్రయాలు జరిగాయి. కానీ, తర్వాత కాస్త ఈ బండ్ల మీద వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే. చాలా రకాల ఇబ్బందులు వస్తున్నాయని ఫిర్యాదులు వచ్చాయి. అంతేకాకుండా ఈ రెండు మోడళ్లు కూడా ధర విషయంలో చాలా ఎక్కువగా ఉన్నాయని వినియోగదారులు భావిస్తున్నారంటూ కామెంట్లు కూడా వింటూనే ఉన్నాం. అందువల్ల ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయని కూడా చెబుతున్నారు.
ఇప్పుడు తమ ఎలక్ట్రిక్ మార్కెట్‌ను గాడిలో పెట్టేందుకు ఓలా కంపెనీ చర్యలు ప్రారంభించింది. వినియోగదారులు, ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రియులకు ఓలా కంపెనీ ఓ శుభవార్త చెప్పింది. త్వరలోనే ఒక గొప్ప అనౌన్స్ మెంట్‌తో రాబోతున్నామంటూ ఆ కంపెనీ సీఈవో భావిష్ అగర్వాల్ ప్రకటించారు. “దీపావళి సందర్భంగా మా లాంఛ్ ఈవెంట్లో ఓ గొప్ప ప్రకటనతో మీ ముందుకు వస్తున్నాం. ఓలా కంపెనీ నుంచి ఇప్పటివరకు వచ్చిన అతి గొప్ప, పెద్ద అనౌన్స్ మెంట్ ఇదే అవుతుంది” అంటూ భావిష్ అగర్వాల్ ట్వీట్ చేశాడు. వారి కంపెనీ దీపావళి ఈవెంట్‌ని అక్టోబర్ 22న నిర్వహించనున్నట్లు వెల్లడించాడు. అయితే ఓలా సీఈవో ట్వీట్‌పై వాణిజ్య రంగం, నిపుణులు, మార్కెట్‌లో పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అసలు ఏం చెప్పబోతున్నారు అంటూ తెగ ఆలోచిస్తున్నారు.
Planning something BIG for our launch event this month! Will accelerate the #EndICEAge revolution by at least 2 years.
Really excited 😉
— Bhavish Aggarwal (@bhash) October 6, 2022
అయితే ఆ వార్త శుభవార్త అనే తెలుస్తోంది. అంటే ఓలా నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రాబోతున్నట్లు చెబుతున్నారు. అది కూడా చాలా తక్కువ ధరలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఓలా కంపెనీ ఎస్ వన్, ఎస్ వన్ ప్రోలు లక్షకంటే ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ రెండు మోడళ్ల కంటే చాలా తక్కువ ధరకు కేవలం రూ.80 వేలకు మాత్రమే ఓలా నుంచి కొత్త మోడల్ స్కూటర్ రాబోతున్నట్లు చెబుతున్నారు. అంతేకాకుండా ఎలక్ట్రిక్ కారును కూడా తీసుకొస్తున్న విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన ప్రకటన కూడా ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే ఆ కారుకు సంబంధించి కొన్ని విషయాలు లీక్ అయ్యాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లు ప్రయాణించే రేంజ్‌లో ఓలా ఎలక్ట్రిక్ కారు తయారు అవుతున్నట్లు చెబుతున్నారు. అతి త్వరలో అవి కూడా అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. ఓలా నిజంగానే రూ.80 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్‌ని అందుబాటులోకి తీసుకొస్తే ఆ కంపెనీ అమ్మకాలు కచ్చితంగా ఊపందుకుంటాయని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Our Diwali event will be on 22nd Oct. One of the biggest announcements ever from Ola. See you soon! pic.twitter.com/389ntUnsDe
— Bhavish Aggarwal (@bhash) October 8, 2022
Truly humbled by the response to our S1 products this Navratras! Since many of you asked, we will be extending the festive offers till Diwali.
Together, we will #EndICEAge. pic.twitter.com/rgCAyiu1PG
— Bhavish Aggarwal (@bhash) October 6, 2022