బతుకుదెరువు కోసం మనదేశం నుండి విదేశాలకు వెళ్తున్న వారు చాలా ఎక్కువ. అందులోనూ గల్ఫ్ దేశాలకు వెళ్తున్న వారే అధికం. అలా వెళ్తున్న వారిలో నాలుగు రాళ్లు సంపాదించుకుంటున్న వారు కొందరైతే.. అక్కడి వారి చేతుల్లో మోసపోయి ఒట్టి చేతులతో తిరిగొచ్చేవారు మరికొందరు. కూతురి పెళ్లికనో, లేదంటే సంపాదించిన నాలుగు రాళ్లకు బంగారం కొనుక్కుందామనే ఆశతోనే.. వచ్చేటపుడు బంగారం కొని తెస్తుంటారు. ఇలా వస్తూ.. వస్తూ.. మరో గంటలో ఇంటికి చేరుకుంటాం అనగా.. కస్టమ్స్ అధికారులకు చిక్కి జైలు పాలవుతున్నారు. అలా ఎందుకు జరుగుతోంది? విదేశాల నుంచి బంగారం తెచ్చుకోకూడదా? ఒకవేళ తెచ్చుకోవచ్చు అంటే.. ఎంతవరకు తీసుకురావచ్చు? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం.. .
నిజానికి విదేశాల నుంచి ఎంత బంగారాన్ని తీసుకురావచ్చో అన్నది చాలా మందికి తెలియదు. ఎక్కువుగా దుబాయి నుంచి బంగారాన్ని ఎక్కువుగా తీసుకొస్తుంటారు. ఎందుకంటే.. ‘సిటీ ఆఫ్ గోల్డ్’ గా పిల్చుకునే దుబాయ్ లో బంగారంపై పన్ను ఉండదు. పన్ను విధించకపోవడం వల్ల అక్కడ బంగారం ధరలు తక్కువగా ఉంటాయి. ఈ కారణం చేతనే అక్కడికి వెళ్లిన వారు.. ఒట్టి చేతులతో రావడం ఎందుకని ఎంతో కొంత బంగారాన్ని తీసుకొస్తుంటారు. అలా.. దుబాయి నుంచి బంగారం తీసుకురావడానికి కొన్ని నియమ, నిబంధనలు ఉన్నాయి. వాటికి లోబడే తీసుకురావాల్సి ఉంటుంది. ఆ నిబంధనలేంటో ఇప్పుడు చూద్దాం..
దుబాయి లేదా మరేదైనా విదేశంలో ఒక సంవత్సరానికి పైగా నివసిస్తున్న భారతీయులు.. ఎటువంటి పన్ను లేకుండా మన దేశానికి రూ. గరిష్టంగా 20 గ్రాములు తీసుకురావచ్చు. దీని విలువ రూ. 50,000 విలువకు సమానం. ఈ నియమం పురుషులకు వర్తిస్తుంది. అదే.. మహిళా ప్రయాణికులయితే.. గరిష్టంగా 40 గ్రాములు తీసుకురావచ్చు. దీని విలువ రూ. లక్ష రూపాయలకు సమానం. ఇంతకు మించి తీసుకురావాలంటే పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
ఒక భారతీయ యాత్రికుడు 1 కిలో బంగారాన్ని తీసుకువస్తే.. భారతీయ మార్కెట్‌లో ఉన్న బంగారం ధరలో 10 శాతం పన్ను చెల్లించాలి. అదే.. 1 కిలో కంటే ఎక్కువుంటే.. బంగారం ధరలో 36.05 శాతం పన్ను చెల్లించాలి. గరిష్టంగా ఒక ప్రయాణికుడు 10 కిలోలకు మించి బంగారాన్ని తీసుకురావడానికి వీలు లేదు. అంతేకాదు.. ఈ బంగారు నగలకు సంబంధించిన బిల్లులను కూడా మీ వద్ద ఉంచుకోవాలి.
బంగారం కాకుండా ఇతర వస్తువులను తీసుకురావడానికి నియమాలు..
విదేశాల నుండి భారతదేశంలోకి ప్రవేశించే ప్రతి ప్రయాణీకుడు కస్టమ్స్ తనిఖీ ద్వారా వెళ్ళవలసి ఉంటుంది. ప్రయాణీకుడు తన బ్యాగేజీలోని వస్తువులను విమానాశ్రయాలలో అందించిన నిర్దేశిత భారతీయ కస్టమ్స్ డిక్లరేషన్ ఫారమ్‌లో ప్రకటించాల్సి ఉంటుంది. ఈ ఫారమ్‌లో, అతను విదేశాలలో చేసిన కొనుగోళ్ల గురించి లేదా తనతో తీసుకువచ్చే వస్తువుల గురించి పూర్తి సమాచారాన్ని పూరించాలి. ఈ విషయంపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.