బంగారం ధర సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత నాలుగు రోజులుగా దిగి వచ్చిన పసిడి ధర.. నేడు ఒక్కసారి భారీగా పెరిగింది. వెండి ధర కూడా పసిడి బాటలోనే పయనించింది. మరి నేడు బంగారం, వెండి ధర ఎంత పెరిగింది అంటే..
బంగారం ధర గత మూడు, నాలుగు రోజులుగా తగ్గుతూ రావడంతో.. పసిడి ప్రియులు, సామాన్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఇలానే మరి కొన్నాళ్ల పాటు ధర తగ్గడం, లేదా స్థిరంగా ఉండటం జరిగితే బాగుండేది అనుకున్నారు. కానీ వారి ఆశలు అడియాసలు చేస్తూ.. బుధవారం పసిడి ధర.. ఒక్కసారిగా భారీగా పెరిగింది. వెండి కూడా బంగారం ధరలోనే పయనించింది. పుత్తడి, వెండి రేట్లు నేడు భారీగా పెరిగాయి. మరి బుధవారం హైదరాబాద్, ఇతర ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి.. ఎంత పెరిగాయి అంటే..
ఇక నేడు అనగా బుధవారం హైదరాబాద్‌లో 22 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ.300 మేర పెరిగింది. దాంతో.. ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్ బంగారం తులం ధర రూ.55, 700 వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ తులం మీద రూ.330 మేర పెరిగి.. ప్రస్తుతం రూ.60,760కి చేరింది. అలానే దేశ రాజధాని ఢిల్లీలో చూసుకున్నట్లయితే 22 క్యారెట్ల బంగారం తులం మీద రూ.300 మేర పెరిగి ప్రస్తుతం రూ.55,850 వద్ద ట్రేడవుతోంది. అలానే 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధర రూ.330 మేర పెరిగి,, ప్రస్తుతం రూ.60 వేల 910 వద్ద కొనసాగుతోంది.
ఇక వెండి ధర గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతూ వస్తూ.. ఏకంగా 32 వారాల గరిష్ఠ స్థాయిని తాకింది. వారం రోజులుగా కిలో వెండి రేటు రూ.80 వేల పైనే ట్రేడవుతోంది. ఇక నేడు అనగా బుధవారం చూసుకుంటే హైదరాబాద్‌లో కిలో వెండిపై రూ.400 మేర పెరిగి రూ.80,400 వద్ద ట్రేడవుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర కూడా రూ.300 పెరిగింది. ప్రస్తుతం హస్తినలో కిలో వెండి ధర రూ.76,600 పలుకుతోంది. ఢిల్లీ, హైదరాబాద్ మధ్య బంగారం, వెండి ధరల్లో చాలా తేడా ఉంటుంది. హైదరాబాద్‌లో వెండి రేటు ఎక్కువుంటే, ఢిల్లీలో బంగారం రేటు అధికంగా ఉంటుంది. స్థానికంగా ఉండే పన్నుల్లో తేడా వల్లనే ఇలా రేట్లలో మార్పు కనిపిస్తోంది.
ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయి దిశగా దూసుకెళ్తున్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2006 డాలర్ల మార్క్ వద్ద కొనసాగుతుండగా.. ఇక స్పాట్ వెండి రేటు ఔన్సులు 25 డాలర్లు పలుకుతోంది. 2 నెలల కిందట బంగారం, వెండి రేట్లు వరసుగా 1800 డాలర్లు, 20 డాలర్ల దిగువన ఉండడం తెలిసిందే. కానీ, ఇప్పుడు భారీగా పెరిగి.. బంగారం, వెండి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఇక గత 10 రోజులుగా తులం బంగారం రూ.60 వేల పైన కొనసాగుతోంది. గత నాలుగు రోజుల్లో కాస్త తగ్గినట్లు కనిపించినా మళ్లీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. వెండి రేటు సైతం కొద్ది రోజులుగా వరుసగా పెరుగుతూ వస్తోంది.