గౌతమ్ అదానీ Vs హిండెన్ బర్గ్ యుద్ధం ఇంకా ముగిసినట్లుగా కనిపించడం లేదు. ఇప్పుడే అసలు కథ మొదలైనట్లుగా భావిస్తున్నారు. ఎందుకంటే హిండెన్ బర్గ్ విషయంలో గౌతమ్ అదానీ కీలక నిర్ణయం తీసుకున్నారు.
గౌతమ్ అదానీ.. కొన్నిరోజుల క్రితం ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానంలో ఉన్న వ్యక్తి ఇప్పుడు మాత్రం అమెరికా రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ ఇచ్చిన రిపోర్టుల కారణంగా లక్షల కోట్ల ఆస్తిని నష్టపోయారు. అదానీ గ్రూపు కంపెనీపై హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణలు అందరికీ తెలిసిందే. పన్నుల్లేని దేశాల్లో అదానీ గ్రూపు డొల్ల కంపెనీలు సృష్టించిందంటూ ఆరోపించింది. ఈ ఆరోపణలతు అదానీ గ్రూపు కంపెనీలు అన్నీ సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఇప్పుడు ఆ సంక్షోభం నుంచి మెల్లిగా కోలుకుంటున్నాయి కూడా. అయితే అంతా అదానీ Vs హిండెన్ గ్రూప్ కంపెనీ ఛాప్టర్ ముగిసిపోయింది అనుకుంటున్నారు. కానీ, ఇంక యుద్ధం మిగిలే ఉందని అదానీ చెప్పకచెబుతున్నారు.
అదానీ గ్రూపు విషయంలో హిండెన్ బర్గ్ కంపెనీ విడుదల చేసిన రిపోర్టులు ఆ కంపెనీని ఆర్థికంగా దెబ్బతీసిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలోనే హిండెన్ బర్గ్ రిపోర్టును అదానీ గ్రూపు, స్వయంగా గౌతమ్ అదానీ కూడా ఖండించారు. తమ బ్యాలెన్స్ షీట్లు ఎంతో ఆరోగ్యకరంగా ఉన్నట్లు వీడియో కాన్ఫరెన్స్ లో స్పష్టం కూడా చేశారు. హిండెన్ బర్గ్ పై న్యాయ పోరాటం కూడా చేస్తామంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు మాటల్లో కాకుండా చేతలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. హిండెన్ బర్గ్ పై న్యాయపోరాటానికి అమెరికాలోనే అత్యంత శక్తివంతమైన న్యాయసంస్థ ‘వాచ్ టెల్’ ను సంప్రదించినట్లు తెలుస్తోంది.
ఫైనాన్షియల్ కథనం ప్రకారం.. హిండెన్ బర్గ్ రిపోర్టుల కారణంగా అదానీ గ్రూపునకు ఎదురైన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు వాచ్ టెల్, లిప్టెన్, రోసెన్, కాట్జ్ వంటి సంస్థల్లోని న్యాయవాదులను సంప్రదించినట్లు చెబుతున్నారు. వీరి మీటింగ్ కూడా అదానీ గ్రూపునకు బాగా కావాల్సిన సిరిల్ అమర్ చంద్ మంగళ్ దాస్ కార్యాలయంలో జరిగినట్లు చెబుతున్నారు. సిరిల్ ష్రాఫ్ కుమార్తెను అదానీ కుమారుడికి ఇచ్చి వివాహం చేశారు. ఈ వాచ్ టెల్ న్యాయసంస్థకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. పెద్ద పెద్ద కంపెనీల వ్యవహారాలకు సంబంధించి ఈ సంస్థనే సంప్రదిస్తూ ఉంటారు.
Gautam Adani has hired one of Wall Street’s fiercest activism defence law firms to fight back against claims made by short seller Hindenburg Research: FT
Wachtell is known as one of the most expensive law firms in the US. #AdaniEnterprise #Adani #HindenbergResearch pic.twitter.com/icg9p5dChk
— Ravi Prakash Kumar (@RaviPksThakur) February 10, 2023