‘డబ్బులు సంపాదించే మార్గం..’ ఈ విషయం గురించి ఆలోచించని మనిషి భూమిమీద ఉండడు. చేతిలో రూపాయి లేకపోయే ఆ పూట ఖాళీ కడుపుతో పడుకోవాల్సిన రోజులివి. ఇలాంటి రోజుల్లో డబ్బులు సంపాదించే మార్గాల గురుంచి అన్వేషించడంలో ఎలాంటి తప్పు లేదు. అలా డబ్బును సంపాదించే పెట్టే మార్గమే ఈ వార్త. ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతాలు ఉంటున్నాయి. ఆ ఖాతాల్లో ఎంతో కొంత డబ్బును ఆదా చేస్తుంటారు. అలా ఆదా చేసే డబ్బును సాధారణ సేవింగ్స్ ఖాతాలో కాకుండా ‘స్వీప్ ఇన్/ఆటో స్వీప్ తో ఫిక్సడ్ డిపాజిట్’ ఆప్షన్ ను కనుక ఎంచుకుంటే పెద్ద మొత్తంలో వడ్డీ అందుకోవచ్చు. అదెలా అన్నది ఇప్పుడు చూద్దాం..
బ్యాంకులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన నిత్యజీవితంలో ఇవి ఒక భాగం. డబ్బుల డిపాజిట్ దగ్గరి నుంచి ఏటీఎం క్యాష్ విత్‌డ్రా, రుణాలు, ఆన్లైన్ బ్యాంకింగ్ ఇలా పలు రకాల సర్వీసులు అందిస్తుంటాయి. అయితే సేవింగ్ ఖాతాల్లానే బ్యాంకుల్లో రకరకాల ఖాతాలు ఉంటాయి. ‘జీరో బ్యాలెన్స్ అకౌంట్ అని, కరెంట్ బ్యాంక్ అని, డీమ్యాట్ అకౌంట్ అని, ఎన్ఆర్ఐ అకౌంట్ అని.. ఇలా రాకరకాలుంటాయి. ఇలాంటి ఖాతాల్లో ‘ఆటో స్వీప్ అకౌంట్’ అనేది కూడా ఒకటి. దీన్ని ఎంచుకుంటే సాధారణ సేవింగ్స్ ఖాతలో వచ్చే వడ్డీ కంటే ఎక్కువ మొత్తంలో వడ్డీ వస్తుంది.
అందుకోసం.. మీరు మీ సేవింగ్ ఖాతాని స్వీప్ – ఇన్ ఎఫ్డీ ఆప్షన్ ను ఎనేబుల్ చేయమని బ్యాంకు అధికారులని అడగండి. అలా అడిగితే ఆ ఆప్షన్ ను ఎనేబుల్ చేస్తారు. దీంతో ఫిక్సడ్ డిపాజిట్లపై వినియోగదారులకు అందించే వడ్డీ.. మీ సేవింగ్ అకౌంట్ లో ఉన్న మనీకి అందిస్తారు. కానీ ఈ మొత్తం ఆయా బ్యాంకులు విధించిన నిబంధనలకు లోబడి లావాదేవీలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఆ అకౌంట్ నుంచి డబ్బులు తీయాలని అనుకుంటున్న ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించకుండానే డబ్బుల్ని డ్రా చేసుకోవచ్చు. మీరు ఆ ఆకౌంట్ వినియోగిస్తున్నప్పుడు సేవింగ్స్ అకౌంట్ గానూ, వినియోగించకపోతే ఫిక్సడ్ డిపాజిట్ అకౌంట్ గానూ పనిచేస్తుంది.
సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ రెండింటినీ కలిపితే అదే ‘ఆటో స్వీప్ ఫెసిలిటీ’ అవుతుంది. ఆటో స్వీప్ అకౌంట్ ఫెసిలిటీతో మీ సేవింగ్స్ ఖాతా ఫిక్స్డ్ డిపాజిట్‌తో లింక్ అవుతుంది. ఫలితంగా సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలోని డబ్బులు ఒక నిర్ణీత లిమిట్ దాటిన తర్వాత ఆటోమేటిక్‌గా ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్లోకి వెళ్లిపోతాయి. ఇలా చేయడం వాళ్ళ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలోని డబ్బులకు వడ్డీ వస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్లోకి వెళ్లిపోయిన డబ్బులకు కూడా వడ్డీ వస్తుంది. అంటే రెండు వడ్డీలు వస్తాయి. సాధారణంగా సేవింగ్స్ ఖాతా కన్నా బ్యాంక్ ఎఫ్డీ అకౌంట్‌కే వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. దీంతో కస్టమర్లకు ప్రయోజనం కలుగుతుంది.