నేటికాలంలో దాదాపు ప్రతి ఒక్కరికి బ్యాంకులో అకౌంట్ ఉంటుంది. సామాన్యుల నుంచి ధనవంతుల వరకు అందరూ ఏదో రూపంలో బ్యాంకు ద్వారా సేవలు పొందుతుంటారు. బ్యాంకులో అనేక రకాలైన డిపాజిట్లు ఉంటాయి. వాటిపై వివిధ స్ఠాయిలో వడ్డీ రేట్లు ఉంటాయి. అయితే వినియోగదారులు బ్యాంకుల్లో ఎప్పుడు ఏ ఏ రేట్లు ఉన్నాయా అని తెలుసుకునేందుకు ఆసక్తిగా చూస్తుంటారు. తాజాగా యాక్సిస్ బ్యాంకు ఫిక్స్ డి డిపాజిట్లపై వడ్డీ రేట్లను మార్చింది. ఈ మార్చిన వడ్డీ రేట్లను సెప్టెంబర్ 20వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. అయితే ప్రస్తుతం ఈ బ్యాంకు కొత్త వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి? ఏ టర్మ్ లకి ఎంత ఆఫర్ చేస్తుంది? ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
యాక్సిస్ బ్యాంకు తన బ్యాంకులోని రూ.2 కోట్ల కంటే తక్కువున్న ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను సమీక్షించింది. అనంతరం యాక్సిస్ బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లులో మార్పు చేసింది. కొత్త వడ్డీ రేట్ల ప్రకారం..సామాన్య ప్రజలకు 2.75 శాతం నుంచి 5.75 శాతం మధ్య ఉండగా సీనియర్ సిటీజన్లకు ఈ రేట్లు 2.75 శాతం నుంచి 6.50 శాతం మధ్యలో వడ్డీ రేట్లను యాక్సిస్ బ్యాంకు ఆఫర్ చేస్తుంది. ఈ బ్యాంకు 7 రోజుల నుంచి 29 రోజుల కాల వ్యవధి డిపాజిట్లకు 2.75 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తుంది. 30 రోజుల నుంచి మూడు నెలల కంటే తక్కువ కాల వ్యవధి గల డిపాజిట్లకు 3.25 శాతం వడ్డీ అందిస్తుంది. అదే విధంగా 6-9 వ్యవధిలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై యాక్సిస్ బ్యాంకు 4.65% ఇంట్రెస్ట్ ఇస్తుంది. 3-6 నెలల లోపల మెచ్యూర్ అయ్యే ఎఫ్డీలకు 3.75 శాతం వడ్డీని ఆఫర్ చేస్తుంది.
ఇక 9 నెలల నుంచి ఏడాది మధ్యకాలంలోని మెచ్యూర్ అయ్యే డిపాజిట్లకు 4.75 శాతం వడ్డీ రేటును యాక్సిస్ బ్యాంకు అందిస్తుంది. ఏడాది నుంచి ఆపైన ఐదు రోజులు, లేదా 11 రోజుల కంటే తక్కువ కాల వ్యవధిలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్లపై 5.45 % వడ్డీని ఈ ఆఫర్ చేస్తుంది. సంవత్సరం 25 రోజుల నుంచి రెండేళ్ల లోపల మెచ్యూర్ అయ్యే ఎఫ్డీలపై యాక్సిస్ బ్యాంకు 5.60 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తుంది. 2-5 ఏళ్ల లోపు మెచ్యూర్ అయ్యే ఎఫ్డీలకు 5.70 శాతం, ఐదేళ్ల నుంచి పదేళ్ల మధ్యలో మెచ్యూర్ అయ్యే ఎఫ్డీలపై 5.75 శాతం వడ్డీ రేట్లను బ్యాంకు ఆఫర్ చేస్తుంది. మరి.. యాక్సిస్ బ్యాంకు కొత్త వడ్డీ రేట్ల మార్పులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.