టెక్ ప్రపంచంలో యాపిల్ కు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఆ కంపెనీకి చెందిన ఫోన్లు మాత్రమే కాదు.. స్మార్ట్ వాచ్, ఎయిర్ పోడ్స్ ఇలా ప్రతి ఒక్క గ్యాడ్జెట్ ని స్టేటస్ సింబల్ గా భావిస్తుంటారు. పైగా యాపిల్ కంపెనీ నుంచి ఫోన్స్, గ్యాడ్జెట్స్ సరికొత్త మోడల్స్ వస్తూనే ఉంటాయి. వాటికి అలవాటు పడిన వాళ్లు మార్కెట్ లోకి కొత్త మోడల్ రాగానే దానిని కొనేస్తారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయనట్లు కనిపిస్తోంది. యాపిల్ ప్రొడక్ట్స్ పై వినియోగదారులకు మోజు పోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే అసలు అలా ఎందుకు అనాల్సి వస్తోందో చూద్దాం.
యాపిల్ విషయంలో మోజు తగ్గింది అనడానికి ప్రధాన కారణం.. ఆ కంపెనీ అమ్మకాల్లో తగ్గుదల కనిపించడమే. యాపిల్ కంపెనీ అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించిన అమ్మకాల వివరాలను వెల్లడించింది. ఈ అమ్మకాల్లో 5 శాతం తగ్గుదల నమోదైంది. అదికూడా గత ఆరేళ్లకాలంలో కనిష్ట అమ్మకాలును నమోదు చేసినట్లు తెలిపారు. ఈ త్రైమాసికంలో యాపిల్ కంపెనీ మొత్తం 117.2 బిలియన్ డాలర్ల అమ్మకాలు చేసింది. ఈ లెక్కలను ఊదాహరణగా చూపే.. యాపిల్ ప్రొడక్ట్స్ పై వినియోగదారుల ఆసక్తి తగ్గిందని చెబుతున్నారు. రానున్న రోజుల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఉత్పత్తుల అమ్మకాలు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇదిలా ఉండగా.. భారత్ లో మాత్రం యాపిల్ సంస్థ వృద్ధిని నమోదు చేసింది. ఆ విషయాన్ని స్వయంగా సీఈవో టిమ్ కుమ్ వెల్లడించారు. త్రైమాసికం ఆధారంగా భారత్ లో రికార్డు స్థాయి ఆదాయాన్ని నమోదు చేశామన్నారు. భారత్‌లో ఒక్క ఐఫోన్లు మాత్రమే కాదు.. ఐప్యాడ్, మ్యాక్ బుక్ విక్రయాలు కూడా బాగా జరుగుతున్నాయని తెలిపారు. ఎక్కువశాతం అమ్మకాలు యాపిల్ ఆన్ లైన్ స్టోర్ ద్వారా జరుగుతున్నాయన్నారు. భారత్ లో త్వరలోనే రిటైల్ స్టోర్ ని ప్రారంభిస్తామని టిమ్ కుక్ ప్రకటించారు. అలాగే ఆన్ లైన్- ఆఫ్ లైన్ అమ్మకాల్లో పెద్దఎత్తున పెట్టుబడులు పెడతామని స్పష్టం చేశారు. భారత్ విషయంలో తాను ఎంతో ఆసక్తిగా ఉన్నాని తెలిపారు.
Apple CEO #TimCook has expressed confidence in selling more iPhones across India.
What’s the reason behind his “extremely bullish” stance on India?
Find out ⬇️| @Apple @tim_cook #iPhone https://t.co/hcd1DKQOS7 pic.twitter.com/JJly8mEWsK
— CNBC-TV18 (@CNBCTV18News) February 3, 2023