సుదీపా.. ఇలా చెప్తే చాలా మంది గుర్తుపట్టక పోవచ్చు. అదే పింకీ అని చెప్తే తెలుగు ప్రేక్షకులు అందరూ గుర్తుపట్టేస్తారు. అప్పుడెప్పుడో 2001లో నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో పింకీగా కనిపించింది. ఇప్పటికీ ఆమెను పింకీ అనే పిలుస్తారు. చిన్నప్పటి నుంచే కూచిపూడి నేర్చుకుంది, సినిమాలు చేసింది, ఇప్పుడు సీరియల్స్ లో కనిపిస్తోంది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడింది. లైఫ్ మొత్తం అనుకున్నట్లుగానే సాగిపోతోంది. సంపాదన పరంగా ఎలాంటి లోటు లేదు. చాలా బాగా సెటిల్ అయిపోయారు. కానీ, జీవితంలో మాత్రం తనకు ఒక లోటు అలాగే ఉండిపోయిదంటూ సుదీపా పింకీ ఏడ్చేసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో సుదీపా పింకీ పంచుకున్న ఆ విషయాలు ఏంటో చూద్దాం.
“నాకు లైఫ్‌లో అన్నీ ఉన్నాయి. నేను కోరుకున్నది కోరుకున్నట్లుగా జరిగింది. ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకున్నాను. ఫైనాన్షియల్ పరంగానూ నాకు ఎలాంటి లోటు లేదు. సినిమా ఆఫర్లు వచ్చాయి. 2015లో ఒకసారి నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. అప్పుడే ఆస్ట్రేలియా టూర్ ఆఫర్ కూడా వచ్చింది. ఆ సమయంలో నేను ఇంకా రెడీ కాలేదు అనుకున్నాను. అంతేకాకుండా నాకు అప్పుడు అంత ఎమోషనల్ బాండింగ్ కూడా లేదు. సో నేను వద్దు అనుకున్నాను. అబోర్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత దాని గురించి పెద్దగా ఫీల్ కూడా కాలేదు. ఆ తర్వాత నా లైఫ్‌లో నేను బిజీ అయిపోయాను. అందరూ ఇంకా ఎప్పుడు పిల్లలు అని అడగడం ప్రారంభించారు” అంటూ సుదీపా పింకీ ఎమోషనల్ అయ్యింది.
“ఆ తర్వాత 2018లో ఒకసారి మళ్లీ నేను ప్రెగ్నెంట్ అయ్యాను. అప్పుడు కూడా నేను అంత రెడీగా లేను. కావాలి అని కూడా అనుకోలేదు. కానీ, ఈసారి దేవుడు ఇచ్చాడు.. నేను వద్దనుకున్నా వచ్చింది. ఎందుకు మళ్లీ కాదనుకోవడం అని ఉంచుకోవాలని ఫిక్స్ అయ్యాం. మొదటి నెలలో నేను అసలు అంత బాండింగ్ కూడా లేదు. రెండో నెల నుంచి అటాచ్ అవ్వడం స్టార్ట్ చేశాను. నా బాడీలో మార్పులను ఫీల్ అవుతున్నాను. బేబీతో బాండింగ్ ఏర్పడింది. మా వారు లైఫ్‌లో కోరుకున్నవి దక్కవు అనే నమ్మకంలో ఉండేవారు. ఆయన లైఫ్‌లో జరిగిన కొన్ని ఘటనలు అలాంటివి. నా భర్త కూడా బేబీతో ఎమోషనల్ గా దగ్గరయ్యాడు. ఈ న్యూస్ తెలిసిన తర్వాత ఆ కెరీర్ పరంగా కూడా బాగుంది. ఇద్దరం కావాలనుకుంటున్నాం. కానీ, నాకు థైరాయిడ్ ఎక్కువైపోయి అప్పుడు అబార్షన్ అయిపోయింది” అంటూ సుదీపా పింకీ ఏడ్చేసింది.
“ఆ తర్వాత మళ్లీ ఇప్పటివరకు నాకు ఆ అవకాశం దక్కలేదు. నేను మెంటల్‌గా డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. తర్వాత నా చెల్లెలి కూతురు వచ్చింది. దానికి ఎమోషనల్‌గా దగ్గరవ్వడం ప్రారంభించాను. అది చూడటానికి నాకులాగే ఉంటుంది, అలవాట్లు కూడా నాకులానే ఉంటాయి. ఆమెకు దగ్గరవుతున్న సమయంలో నా భర్త ఒక మాట అన్నారు. ఎప్పటికైనా ఆమె మీ చెల్లెలి బిడ్డే.. వాళ్లకే ఇచ్చేయాలి అని. నా లైఫ్‌లో నేను ఆరుగురు పెద్ద పెద్ద డాక్టర్లను కలిశాను. నాలో లోపం లేదు, నా భర్తలో లోపం లేదు. కానీ, మాకు పిల్లలు పుట్టడం లేదు. మా వారికి అందరు పిల్లలు ఊరికే దగ్గరైపోతారు. ఆయన ఒక మాట అన్నారు. అందరి పిల్లను నాకు దగ్గరవుతుంటారు.. కానీ, మన పిల్లలు మాత్రం మనకు దగ్గర కావడం లేదు” అంటూ సుదీపా బాగా ఏడ్చేసింది. సుదీపా పింకీ ఎమోషనల్ జర్నీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.