బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. రాను రాను కాస్త ఇంట్రెస్టింగ్‌గానే తయారు చేస్తున్నారు. విన్నర్‌కి మాత్రం ఈ వారం ముగిసేలోగా చిల్లిగవ్వ కూడా మిగిల్చేలా లేరు. ప్రతి టాస్కుని ప్రైజ్ మనీకి ముడిపెట్టి నానా యాగి చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 10 లక్షలు ఖాళీ అయ్యాయి. ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్కుని కూడా ప్రైజ్ మనీకే ముడిపెట్టాడు. ఈసారి ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం మూడు అమౌంట్లను చూపించారు. ఎవరైతే ఆ అమౌంట్‌కు ఓకే చేస్తూ బజర్ కొట్టాలి. అలా ముగ్గురికి అవకాశం కల్పించారు. అలా రేవంత్, శ్రీహాన్, ఫైమా బజర్ కొట్టారు. వారికి మరో టాస్కుని ఏర్పాటు చేశారు. వారికి ఎవిక్షన్ ఫ్రీ పాస్ కావాలి అంటే వారికి హౌస్ మేట్స్ సపోర్ట్ కావాలి. ఈసారి బిగ్ బాస్ టాస్క్ గట్టిగానే ఇచ్చాడు.
అలా టాస్కులో ఉన్న రేవంత్, శ్రీహాన్, ఫైమాలకు సపోర్ట్ చేసే వారు వారి ప్రత్యర్థులకు బ్యాగులు వేయాల్సి ఉంటుంది. ఈ ముగ్గురి భుజాల మీద మూడు కాడెలు వేశారు. బజర్ మోగిన ప్రతిసారి ఇంట్లోని సభ్యులు పరిగెత్తుకు వెళ్లి బ్యాగ్ తీసుకోవాలి. అలా వారు తీసుకున్న బ్యాగుని వారు సపోర్ట్ చేసే వారికి కాకుండా మిగిలిన వారికి వేయాలి. అలా వేస్తూ అందుకు తగిన కారణం చెప్పాలి. అలా తొలి బ్యాగును ఆదిరెడ్డి అందుకుని రేవంత్‌కి వేశాడు. అందుకు తగిన కారణం కూడా చెప్పాడు. మిగిలిన కారణాలు మళ్లీ బ్యాగులు వేసే సమయంలో చెప్తాను అంటూ చెప్పుకొచ్చాడు. అలా బజర్ మోగిన ప్రతిసారి ఒక బ్యాగు తీసుకుని ముగ్గురిలో వారు ఎవరికి పాస్ వద్దు అనుకుంటున్నారో వారికి వేస్తూ వచ్చారు.
అయితే ఎక్కువ బ్యాగులు రేవంత్, శ్రీహాన్‌లకు పడ్డాయి. శ్రీసత్యకు అవకాశం వచ్చినప్పుడు ఫైమాకి వేస్తూ వచ్చింది. కానీ, శ్రీహాన్‌కే ఎక్కువ బ్యాగులు పడ్డాయి. ఈ టాస్కులో నాకు ఒక క్లారిటీ వచ్చింది. ఎవిక్షన్ ఫ్రీ పాస్ మాత్రం ఫైమాకే వస్తుంది అంటూ శ్రీహాన్ కామెంట్ చేశాడు. అలా చెప్పిన కాసేపటికే శ్రీహాన్ ఆ కాడెను, బ్యాగులను కింద పడేసి కుప్పకూలాడు. శ్రీహాన్ పడిపోవడం చూసిన శ్రీసత్య పరిగెత్తుకుంటూ వెళ్లి అతడి తలను ఒడిలో పెట్టుకుని లేపేందుకు ప్రయత్నించింది. ఈ టాస్కు ద్వారా హౌస్‌లో రేవంత్, శ్రీహాన్, శ్రీసత్య ముగ్గురే ఒక టీమ్ అని అందరికీ క్లారిటీ వచ్చింది. ముగ్గురు ఒకవైపు, ఏడుగురు ఒకవైపు అయ్యారు. ఈ వీక్ గనుక శ్రీసత్య ఎలిమినేట్ అయితే ఇంక శ్రీహాన్, రేవంత్ మాత్రమే టీమ్‌గా ఉంటారు. ఇపట్టికే శ్రీహాన్, రేవంత్ మధ్య కూడా గొడవలు జరుతున్న నేపథ్యంలో అది కూడా చెప్పలేం.