తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న షోల్లో ‘బిగ్ బాస్’ ఒకటి. ఇప్పటికే ఐదు సీజన్లు విజయవంతగా పూర్తి చేసుకుని.. ఆరో సీజన్ లోకి అడుగు పెట్టింది. అయితే ఈ సీజన్ ప్రారంభమై.. ఇప్పటికి రెండు వారాలు మాత్రమే అయింది. ఈ తక్కువ టైమ్ లోనే బిగ్ బాస్-6 ట్విస్ట్ మీద ట్విస్ట్ లతో సాగుతుంది. 21 మంది సభ్యుల హౌస్ లోకి పంపి.. తొలివారంలో నో ఎలిమేషన్స్ అంటూ ఆడియన్స్ కి ట్విస్ట్ ఇచ్చారు. అయితే రెండో వారం అంతకు మించి ట్విస్ట్ ఇచ్చారు. ముఖ్యం బిగ్ బాస్ హౌస్ లోని సభ్యులకు ఇది మామలు ట్విస్ట్ కాదు. అది ఏమిటంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ చేస్తున్నారు. శనివారం షానీ ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఆదివారం అభినయ శ్రీ కూడా హౌస్ నుంచి బయటకి రానుంది.
మొదటి వారం విషయానికి వస్తే.. ఏడుగురు ఎలిమినేషన్ లో ఉన్నారు. వారిలో ఒకరైన అభినయ శ్రీ అప్పుడే ఎలిమినేట్ అయ్యేదే. అయితే ఆ వారం బిగ్ బాస్ ఎలిమినేషన్‌ని ఎత్తేసి అభినయని సేవ్ చేశారు. ఇక రెండో వారం విషయానికి వస్తే.. ఆది రెడ్డి, రోహిత్-మెరీనా, షానీ సాల్మన్, రాజ్, రేవంత్, అభినయ శ్రీ, ఫైమా, గలాటా గీతు నామినేషన్స్ లో ఉన్నారు. తొలివారం నో ఎలిమినేషన్ అంటూ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్ ఈవారం సభ్యులకి బడా ట్విస్ట్ ఇచ్చాడు. డబుల్ ఎలిమినేషన్ అంటూ బిగ్ బాస్ పాత లెక్కల్ని సరిచేశాడు. ఈ వారం ఒక్కేసారి ఇద్దరిని ఎలిమినేట్ చేశాడు. అయితే డబుల్ ఎలిమినేష్ ప్రాసెస్ లో షానీ, అభినయ శ్రీ ఉన్నారు. ఈ వారం వీరిద్దరు హౌస్ నుంచి బయటకి వస్తున్నారు. ఈక్రమంలో శనివారం షానీ సాల్మన్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు.
ఆదివారం అభినయశ్రీ హౌస్ నుంచి బయటకి రానున్నట్లు సమాచారం. తొలివారంలో గీతు రాయల్ చేసిన రచ్చ చూశాక.. నామినేషన్స్‌లోకి ఎప్పుడు వస్తుందా? బయటకు పంపుదామా అని ఎదురుచూశారు చాలామంది. రెండో వారానికి బిగ్ బాస్ వాతావరణం మొత్తం మార్చేసింది గీతూ. ఆమె లేకపోతే బిగ్ బాస్ సీజన్-6 లేదు అన్నట్లుగా తన ఆటతో మార్చేసింది. దీంతో గేర్ మార్చిన గీతు.. ఓటింగ్‌లో పుంజుకుంది. అలాగే సింగర్ రేవంత్ కూడా.. అటాకింగ్ గేమ్‌తో తనకి నచ్చినట్టుగా మాస్క్ లేకుండా ఆడుతున్నాడు. అభినయ శ్రీ తొలివారంలో దాదాపు ఎలిమినేషన్ అంచుల వరకూ వెళ్లింది. అయినా రెండోవారంలో ఏ మాత్రం పుంజుకోలేకపోయింది.
ఆమె ఆడటం లేదో.. లేదంటే బిగ్ బాస్ వాళ్లు చూపించడం లేదో కానీ.. ఆమె కనిపించిన ఫ్రేమ్‌లు చాలా తక్కువ. బిగ్ బాస్‌కి వెళ్లామా వచ్చామా అన్నట్టుగానే ఉంటుంది అభినయ శ్రీ. దీంతో డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా శనివారం షానీ సాల్మన్ శనివారం హౌస్ నుంచి బయటకి వచ్చేశాడు. ఇక అభినయశ్రీ ఆదివారం హౌస్ నుంచి ఎలిమినేట్ కానుంది. మరి.. ఈ డబుల్ ఎలిమినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.