గత సీజన్లతో పోలిస్తే ఈసారి బిగ్ బాస్ రేటింగ్స్ ఘోరంగా వస్తున్నాయి. బిగ్ బాస్ ఆరో సీజన్ ప్రారంభ ఎపిసోడ్ కి మరీ దారుంగా 8.86 రేటింగ్ మాత్రమే వచ్చింది. గత సీజన్ తో పోల్చిచూస్తే ఇది సగంలో సగం. దానికి తోడు ఈసారి ఏకంగా 21 మంది పార్టిసిపెంట్స్ ఉన్నారు. అయినా సరే ఎంటర్ టైన్ మెంట్ అనుకున్నంత ఉండట్లేదు. ఇలానే జరిగితే ప్రేక్షకుల్లో కూడా షోపై ఆసక్తి సన్నగిల్లే ఛాన్సులే ఎక్కువ. ఇక వివరాల్లోకి వెళ్తే.. బిగ్ బాస్ హౌస్ అంటే గొడవలు, అలకలు, ప్రేమలు, ముద్దు మురిపెం.. ఇలా అన్ని రకాలు కలగలిసిన ఎంటర్ టైనర్ సినిమాలా ఉండాలి.
గత ఐదు సీజన్లు ఈ విషయంలో ఓకే కానీ.. ఈసారి మాత్రం పైన చెప్పిన వాటిలో కొన్ని మిస్ అయినట్లు కనిపిస్తున్నాయి. తొలివారం గీతూ, రేవంత్ తప్పించి మిగతా ఎవరూ కూడా పెద్దగా యాక్టివ్ గా కనిపించలేదు. సరే తొలివారం కదా కంటెస్టెంట్స్ సర్దుకోవడానికి టైమ్ పడుతుందేమో అని ఆడియెన్స్ అనుకున్నారు. ఇక దీనికి తోడు ఫస్ట్ వీక్ ఎలాంటి ఎలిమినేషన్ కూడా చేయలేదు. ఇకపోతే రెండో వారం వీకెండ్ వచ్చేసింది కానీ హౌసులో ఉన్న 21 మందిలో ఏ ఒక్కరూ కూడా ఆడియెన్స్ దృష్టిని సరిగా ఆకర్షించలేకపోతున్నారు. ఈ విషయాన్నే హోస్ట్ నాగార్జున చాలా సీరియస్ గా తీసుకున్నాడు. ఒక్కొక్కరినీ నిలబెట్టి మరీ ఆడేసుకున్నాడు. కనీసం మాట్లాడే టైమ్ కూడా ఇవ్వకుండా కౌంటర్స్ వేస్తూనే ఉన్నాడు.
మైడియర్ నైన్.. మీరు బిగ్ బాస్ హౌసుకి ఆడటానికి రాలేదు. చిల్ అవడానికి వచ్చారా అని ఫస్ట్ ఫస్టే హౌస్ మేట్స్ అందరిపై నాగ్ సీరియస్ అయ్యాడు. తినడానికి, పడుకోవడానికి వచ్చాననుకుంటే బయటకెళ్లిపో అని అనగా.. షానీ షాకైన విజువల్ ని అక్కడ ప్లే చేశారు.
నువ్వు ఆడటం కాదు అందరి ఆటని చెడగొడుతున్నావ్ అని బాలాదిత్యపై నాగ్ కోప్పడ్డారు. బిగ్ బాస్ హౌస్ మేట్ గా మాత్రమే ఆలోచించు అని వార్నింగ్ ఇచ్చారు. అసలు నీ బొమ్మ వెళ్లిపోయిందని నువ్వు ఫీలయ్యావా? అని శ్రీసత్యని సీరియస్ గా నాగ్ అడగ్గా.. ఆమె అడ్డంగా తలూపింది. నీ ప్లేట్ లాగేస్తే ఊరుకుంటావా అని ఆమె తిండిపై కౌంటర్ వేశాడు.
ఇద్దరూ హౌసులోకి పవర్ ఆఫ్ టూ కింద వచ్చారు కానీ మీ ఆట మైనస్సుల్లో ఉందని మరీనా-రోహిత్ జోడీ ఆటపై నాగ్ కౌంటర్ వేశారు. ఇక అభినయ అయితే తను గేమ్స్ లో ఆడానని హోస్ట్ నాగార్జునతోనే వాదించింది. ఆయన మాత్రం అస్సలు ఆడలేదని అన్నారు. మరోవైపు ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని కూడా కంటెస్టెంట్స్ కి ఝలక్ ఇచ్చారు. దీన్నిబట్టి చూస్తుంటే ఈ శనివారం ఎపిసోడ్ ఫుల్ హీటెక్కించేలా ఉండబోతుందని తెలుస్తోంది. మరి నాగ్ సీరియస్ కావడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: గత సీజన్ల కంటే దారుణంగా పడిపోయిన బిగ్ బాస్ రేటింగ్స్! ఇంత తక్కువా?