బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 గురించి గతంతో పోలిస్తే ఇప్పుడు కాస్త బజ్ నడుస్తోంది. గీతూ రాయ్ ఎలిమినేషన్ తర్వాత కాస్త గాసిప్స్, చర్చలు పెరిగాయి. ఈ వారానికి సంబంధించిన అప్డేట్స్ చూస్తే.. ఫైమా బిగ్ బాస్ హౌస్ కెప్టెన్ అయ్యింది. కెప్టెన్సీ పోటీదారుల టాస్కుల్లో గెలిచి.. కంటెండర్‌గా మారి.. కెప్టెన్ గా విజయం సాధించింది. శ్రీసత్య నుంచి కెప్టెన్ బాధ్యతలు అందుకుంది. హౌస్‌లో ఎప్పుడూ అందరితో జోవియల్‌గా, నవ్వుతూ, నవ్విస్తూ ఉండే ఫైమా కెప్టెన్‌గా బాధ్యతలను ఎలా నిర్వర్తిస్తుందో చూడాలి. ఇంక ఆ టాస్కుకు సంబంధించి వరస్ట్ ఇంటి సభ్యురాలిగా ఎంపికయ్యి ఇనయా సుల్తానా జైలుకు వెళ్లింది. టాస్కులో చాలావరకు ఇనయా బిగ్ బాస్ రూల్స్ ని పాటించకుండా అందరికీ ఇరిటేట్ చేసింది. అందుకే అందరూ కలిసి ఆమెను జైలుకి పంపారు.
ఇంక ఎలిమినేషన్ విషయానికి వస్తే.. ఈవారం డబుల్ ఎలిమినేషన్ జరగనున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 తొలి కెప్టెన్ బాలాదిత్య, ఇంక హౌస్‌లో మథర్ ఇండియాగా బిరుదు తెచ్చుకున్న మెరీనా ఎలిమినేట్ అయినట్లు పక్కా సమాచారం అందింది. అయితే మెరనా ఎలిమినేషన్ విషయాన్ని ఎవరూ అంత సీరియస్‌గా తీసుకోకపోయినా కూడా.. బాలాదిత్య ఎలిమినేషన్‌పై భిన్నాభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. అసలు బాలాదిత్యా ఎందుకు ఎలిమినేట్ అయ్యాడు? అందుకు ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయా? అనే విషయాలపై వెతుకులాట మొదలు పెట్టారు. అయితే బాలాదిత్య ఎలిమిమేషన్కు ముఖ్యంగా 5 కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది.
అతి మంచితనం.. అవును బాలాదిత్య అతి మంచితనమే అతనికి హౌస్‌లో బ్యాడ్ అయ్యింది. మొదటి నుండి కూడా బాలాదిత్య తనలో ఉన్న మంచితనంతో చాలా ఇబ్బందులు పడ్డాడు. అయినా కూడా ఇంకా మంచివాడిలాగానే ఉండేందుకే ప్రయత్నించాడు. అదే సాకుగా చూపి నామినేట్ చేసినవాళ్లు కూడా ఉన్నారు.
బాలాదిత్యకు ఉన్న మంచి లక్షణాల్లో శాంతం కూడా ఒకటి. ఏదైనా ఘటన జరిగినా, గేమ్ ఆడాల్సి వచ్చినా కూడా బాలాదిత్య శాంతంగా ఉంటాడు. అది కూడా అతనికి మైనస్ అయ్యింది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్‌లో కేకలు వేసిన వాళ్లు విజేతలు అవ్వడం చూశాం.. కానీ, శాంతకాముకులు ఎవరూ విన్నర్ కాలేదు. హౌస్‌లో నెగ్గుగు రావాలంటే శాంతంగా ఉంటే పనికాదు. అందుకే షానీ కూడా స్టార్టింగ్ వారాల్లోనే ఎలిమినేట్ అయ్యాడు.
బాలాదిత్యకు అంతా తెలుసు కానీ.. లౌక్యంగా వ్యవహరించడం రాదు. అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఎదుటివారికి సోప్ వేయడం రాదనమాట. ఉన్నది ఉన్నట్లు చెప్పి పక్కకు వెళ్లిపోతే జనాలతో కుదరదు. ఎదుటివారు కొన్నిసార్లు తప్పుని తప్పు అని చెప్పినా కూడా తీసుకోలేరనే విషయం అందరికీ తెలిసిందే. హౌస్‌లో కొనసాగాలి అంటే శత్రువుల కంటే ఎక్కువగా మిత్రులు ఉండాలి. బాలాదిత్యకు రానురాను మిత్రుల సంఖ్య తగ్గిపోయిన విషయం తెలిసిందే.
బాలాదిత్య సిగిరెట్లు గీతూ దాచిపెట్టిన విషయం తెలిసిందే. అలా దాచిపెట్టి బాగా నెగెటివ్ అయ్యి ఆమె హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యిందని అంతా భావిస్తున్నారు. అయితే అదే అంశం ఇటు బాలాదిత్యకు కూడా నెగెటివ్ అయ్యింది. ఒక్క సిగిరెట్ కోసం చెల్లి అని పిలిచే గీతూ రాయల్ని అన్ని మాటలు అనడం కాస్త నెగెటివ్‌గానే ప్రొజెక్ట్ అయ్యింది. ఆఫ్టరాల్ సిగిరెట్ అంటూ దానికోసం గీతూని అన్ని మాటలు అనేసరికి.. కన్ఫ్యూజ్ అయ్యారు.
బాలాదిత్య ఎలిమినేషన్‌కు బిగ్ బాస్ వాళ్లు సెన్సేషన్ చేయాలనే ఆలోచన కూడా ఉండచ్చు. ఎందుకంటే గీతూ రాయల్ ఎలిమినేట్ కాగానే.. బయట బిగ్ బాస్ గురించి బాగా బజ్ నడిచింది. గీతూ ఎలిమినేట్ కావడం ఏంటంటూ వ్యాఖ్యలు వచ్చాయి. కాస్త బిగ్ బాస్ సీజన్‌కు బజ్ కూడా పెరిగింది. అందుకే కాస్త కాంట్రవర్సీ ఎలిమినేషన్ దిశగా బిగ్ బాస్ వాళ్లు ఆలోచించారనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. కారణం ఏందైనా బాలాదిత్య అయితే తన గేమ్ ముగించుకుని బయటకు వచ్చేస్తున్నాడు.