బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ప్రస్తుతం గీతూ రాయల్ లేకపోవడం వల్ల కాస్త సప్పగా సాగుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గీతూ రాయల్ టాప్-5 కంటెస్టెంట్ అని హేటర్స్ కూడా ఒప్పుకున్నారు. కానీ, అనూహ్యంగా గీతూ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. వచ్చాక ఆమెది ఫెయిర్ ఎలిమినేషన్ కాదంటూ ఇంట్లోని సభ్యులు, బయట ప్రేక్షకులు కూడా చెప్పారు. కానీ, ఒకసారి ఎలిమినేట్ అయ్యాక మళ్లీ తిరిగి వెళ్లడం అనేది జరిగే పనికాదు. హౌస్‌లో ఉన్నప్పుడు గీతూ చేసిన పనులు, ఆడిన ఆట, చెప్పిన మాటలు చాలామందికి నచ్చలేదనే విషయం తెలిసిందే. అయితే బయటకు ఎంత నెగిటివ్‌గా ప్రొజెక్ట్ అయ్యిందో చూసుకుని గీతూ కూడా అందరికీ సారీ చెప్పింది. అయితే తన ఎలిమినేషన్ మీద కూడా గీతూ రాయల్ కామెంట్స్ చేసింది.
తాజాగా ఓ గంట వీడియో తన యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది. ఆ వీడియో గీతూ రాయల్ మాట్లాడుతూ.. “బిగ్ బాస్ హౌస్‌లో జరిగింది మొత్తం మీకు బయటకు రాదు. అక్కడ 24 గంటల స్ట్రీమిగ్లో కూడా ఎడిట్ చేస్తుంటారు. నిజంగా నాకు బిగ్ బాస్ ఎడిటర్లంటే రెస్పెక్ట్ వచ్చింది. అన్న కెమెరాల్లో రికార్డ్ అయి ఫీడ్ మొత్తాన్ని 24 గంటలకు తీసుకురావాలి. అనవసరమైన చెత్త అంతా తీసేయాలి. నిజానికి నన్ను బిగ్ బాస్ హౌస్‌లో ఎంత పొగిడేవారో మీకు ఎవరికీ తెలియదు. గీతూ తోపు తోపు అనేవారు. నేను ఏం చేసినా కూడా బిగ్ బాస్ ఎప్పుడూ ఎదురు చెప్పలేదు. తప్పు అనలేదు. నేను ఏం చేసిన బాగా పొగిడే వారు. నాగార్జున గారు కూడా నన్ను ఎంతో పొగిడే వారు. కానీ, అవేమీ బయటకు రాలేదు.
ఒకవేళ అచ్చంగా నన్నే పొగడటం చూపిస్తే వన్ సైడ్ అవుతుంది అనుకున్నారో.. లేక మిగిలిన వాళ్లకి కూడా ఓట్లు పడాలి అని ఎడిట్ చేశారో నాకు తెలియదు. నాగార్జున గారు నేను ఎలిమినేట్ అయినరోజు కూడా పొగిడారు. మాస్క్ లేకుండా హౌస్‌లో ఆడిన ఏకైక వ్యక్తిని నేను అన్నారు. కెప్టెన్ కాలేకపోయాను అంటే.. 9 వారాలు ఈ హౌస్‌ని రూల్ చేసింది నువ్వే అంటూ చెప్పుకొచ్చారు. ఎంత అంటే పొగిడి పొగిడి నన్ను మునగ చెట్టు ఎక్కించారు. అంత పొగిడిన తర్వాత నేనే తోపు అనుకున్నాను. కానీ, బయటకు వచ్చిన తర్వాత అర్థమైంది. నాది ఓవర్ కాన్ఫిడెన్స్ అని. వాళ్ల మాటలు విని నేను టాప్-5, విన్నర్ కూడా అయిపోతాను అనుకున్నా. కానీ, అలా జరగలేదు. మునగచెట్టు ఎక్కించి చివరికి ఎలిమినేట్ చేసి పంపేశారు. నాకు ఓట్ చేసి.. నన్ను అర్థం చేసుకున్న ప్రతిఒక్కరికి చాలా థ్యాంక్స్” అంటూ గీతూ రాయల్ ఎమోషనల్ అయ్యింది.