శనివారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ మొత్తం గరంగరంగా సాగింది. హోస్ట్ గా ఉన్న కింగ్ నాగార్జన ఒక్కో సభ్యులను నిలబెట్టి మరీ కడిగిపారేశాడు. ఇక మొహం మీదే దారుణమైన మాటలు అనేశాడు. మీరంతా ఉండి కూడా వేస్ట్ అని అనేశాడు. తినడానికి పడుకోవడానికి వచ్చి ఉంటే.. అవసరం లేదు.. వెళ్లిపోండి అంటూ అందరికీ అక్షింతలు వేశాడు. ఇదే సమయంలో డబుల్ ఎలిమినేషనల్ భాగంగా మొదట షానీ సల్మాన్ ని హౌస్ నుంచి బయటకి వచ్చేశాడు. అయితే షానీకి బిగ్ బాస్ హౌస్ వీడ్కోలు చెప్పిన విధానంకి ఆయన ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు.
తెలుగు బిగ్ బాస్ షో విషయానికి వస్తే సభ్యుల ఎలిమినేషన్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. గత సీజన్లలో చూసినట్లు అయితే ఎలిమినేట్ అయిన సభ్యులను స్టేజి మీదకు పిలుస్తారు. ఆ తరువాత సదరు సభ్యుడి హౌస్ లో గడిపిన మధుర జ్ఞాపకాల గురించి ఓ ఏవీ ని వేస్తారు. అనంతరం హౌస్ లో జరిగిన విశేషాలను ఆ ఎలిమినేట్ అయిన సభ్యుడి ద్వారా తెలుసుకుంటారు. ఆ తర్వాత మిగిలిన సభ్యుల గురించి అభిప్రాయాలను షేర్ చేసుకుంటారు. చివరగా ఎలిమినేట్ అయిన వ్యక్తి స్టేజి నుంచి వెళ్తూ.. హౌస్ లోని మిగిలిన సభ్యులకు టాస్క్ ఇచ్చి వెళ్తుంటారు. అయితే శనివారం జరిగిన షానీ ఎలిమినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది. షానీ సల్మాన్ కి వీడ్కోలు పలికిన విధానంపై ఆయన అభిమానులు చాలా సీరియస్ గా ఉన్నట్లు టాక్.
షానీ ని బిగ్ బాస్ స్టేజి మీదకు పిలిచిన నాగార్జున చాలా సింపుల్ గా బయటకి పంపించారు. కేవలం షానీ ని కొన్ని మాటలే మాట్లాడించి.. అనంతరం అక్కడి నుంచి పంపించేశారు. అయితే ఈ విషయంపై ఆయన ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కనీసం ఏవీ కూడా వేయకుండా అవమానకరంగా బయటకి పంపించారని అభిప్రాయం వ్యక్తం చేశారు. తన అభిప్రాయాలను పూర్తిగా షేర్ చేసుకోకుండనే షానీని బయటకి పంపిచారని ఫీల్ అవుతున్నారు. గతంలో మాదిరి స్టేజిపై షానీ చేత ఎటువంటి టాస్క్ లో చేయించలేదు. చాలా సాదా సీదా పంపించారు. తెలుగు బిగ్ బాస్ చరిత్రలోని ఇలాంటి వీడ్కోలు ఎవరికి పలకలేదని, కావాలనే ఇలా చేశారని కొందరు అభిప్రాయా పడుతున్నారు.
ఇది ఇలా ఉంచితే శనివారం బిగ్ బాస్ హౌస్ దద్దరిల్లిపోయింది. వారంలో ఎవరెవరు ఎలా ఆటలు ఆడారు.. ఎవరు ఎలాంటి అశ్రద్ధ మాటలు మాట్లాడారో అన్నీ గుర్తు పెట్టుకుని మరీ తిరిగి ఇచ్చేశాడు నాగార్జున. ఈ శనివారం ఎపిసోడ్లో సభ్యులందరికి ఓ రేంజ్ లో వార్నింగ్ లు ఇచ్చాడు నాగార్జున. ఆ మాత్రం పడితేగానీ సెట్ అయ్యేలా లేరని అనుకుందో ఏమో గానీ బిగ్ బాస్ టీం మాత్రం అందరికీ గట్టిగానే తలంటు పోయించేసింది. నాగార్జున కూడా ఓ రేంజ్ ఫైర్ మీద కనిపించాడు. మరి.. బిగ్ బాస్.. షానీ సాల్మన్ కి వీడ్కోలు పలికిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.