బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ప్రేక్షకులను బాగా ఎంటర్ టైన్ చేస్తోంది. నామినేషన్, ఎలిమినేషన్, కెప్టెన్సీ లాంటి విషయాల కంటే కూడా వేరే కొన్ని విషయాలు ఇంట్రస్టింగ్ గా మారాయి. వాటిలో ముఖ్యమైనది శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్ ఇష్యూనే. వారిద్దరి మధ్య ఏదో జరుగుతుందని టాక్. ఇటీవలే హౌస్ లో జరిగిన ఓ సన్నీవేశం దానికి బలం చేకూరుస్తోంది. అది ఏమిటంటే.. హౌస్ లో రేవంత్ అర్జున్ కల్యాణ్ వద్దకు వెళ్లి.. శ్రీ సత్య- వాసంతి చెల్లెళ్లు అని చెప్తాడు. అప్పుడు అర్జున్ కల్యాణ్ మొదట కాదని వారించి ఆ తర్వాత కేవలం వాసంతి మాత్రమే తనకు సిస్టర్ గా అంగీకరిస్తాడు. దీంతో శ్రీ సత్య, అర్జున్ కల్యాణ మధ్య ఏదో జరుగుతుందని ప్రేక్షకులు అభిప్రాయాపడుతున్నారు. తాజాగా ఆ విషయాన్ని బయటపెట్టే ప్రయత్నం చేశాడు బిగ్ బాస్.
బిగ్ బాస్ హౌస్ లోకి మిల్కీబ్యూటీ తమన్నా వెళ్లింది. ఈ అమ్మడు నటించిన బబ్లీ బౌన్సర్ సినిమా త్వరలో ప్రేక్షకు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టింది ఈ మిల్కీ బ్యూటీ. ఇంట్లోని సభ్యుల కోసం ‘తమన్నా కానుక’ పేరుతో ఓ గిప్ట్ హ్యాంపర్ ను హౌస్ లోకి తీసుకెళ్లింది. ఇందుకు సంబంధించిన ప్రోమోను విడుదలైంది. బిగ్ బాస్ హౌస్ లోని మగవారికి నాగార్జున ఓ ఆఫర్ ఇచ్చారు. “ఇక్కడ ఉన్న ప్రతి అబ్బాయి.. హౌస్‌లో ఉన్న ఒకమ్మాయిని తమ బౌన్సర్ గా ఎంచుకోవచ్చు” అని చెప్పారు. చంటి.. తనకి బౌన్సర్ గా ఫైమాను ఎంచుకుని బ్యాండేజ్ తొడిగాడు. అలా మిగిలిన అబ్బాయిలు కూడా తమకు నచ్చిన వారిని ఔన్సర్ గా ఎంచుకున్నారు.
ఈ క్రమంలో అర్జున్ కల్యాణ్.. తన బౌన్సర్ గా శ్రీ సత్యను ఎంచుకున్నాడు. అర్జున్.. సత్య పేరు చెప్పగానే బయట ఉన్న ఆడియెన్స్ అరిచారు. అంతే కాకా ఒక ప్రేక్షకురాలు వారి మధ్య ఏదో ఉందని అంటుంది. దానికి నాగార్జున.. అర్జున్ కళ్యాణ్ విషయంలోనా? అని అడిగారు. దానికి అర్జున్ అదో రకంగా ముఖం పెట్టాడు. దానికి వెనుక ఉన్న మిగతా కంటెస్టెంట్లు ‘కమల్ హాసన్’ అని అంటూ కామెంట్స్ చేశారు. ఆమె నాకు మంచి ఫ్రెండ్ సరే.. అంతే అని అర్జున్ అన్నాడు. తమన్నా మాట్లాడుతూ.. ‘మేం ఎన్ని సినిమాల్లో నటించాం.. అందులో అన్నీ ఫ్రెండ్ షిప్ తోనే మొదలవుతాయి” అని అంటుంది.
100% లవ్ లో కూడా హీరోహీరోయిన్లు బాగా కొట్టకున్నారు కదా, అందులో మహాలక్ష్మి క్యారెక్టర్‌కి చికెన్ అంటే చాలా ఇష్టం కదా అన్నారు నాగార్జున. ఈక్రమంలో శ్రీ సత్య సిగ్గుపడుతున్నట్టు ముఖం పెట్టింది. దీంతో ఆడియన్స్ అన్న మాటలకు బలం చేకూరింది. వారిద్దరి మధ్య ఏదో జరుగుతోందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే తామిద్దరం నాలుగేళ్లుగా మంచి మిత్రులమని శ్రీ సత్యనే గతంలో చెప్పింది. అర్జున్- శ్రీ సత్య మధ్య ఏముంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.