‘బిగ్ బాస్ 5 తెలుగు’ చాలా ఇంట్రస్టింగ్‌గా నడుస్తోంది. మోస్ట్ రేటెడ్ రియాలిటీ షోగా కూడా గుర్తింపు పొందింది. కరోనా నేపథ్యంలో పెద్దగా గుర్తింపులేని వ్యక్తులనే సెలెక్ట్ చేసినా.. టీఆర్పీ మాత్రం ఏమాత్రం తగ్గకుండా ప్లాన్ చేస్తున్నారు. తాజాగా సెట్ శ్వేతా వర్మను ఎలిమినేట్ చేసిన బిగ్‌బాస్..లోబోని సీక్రెట్ రూమ్‌లో ఉంచిన విషయం తెలిసిందే. ఈ వారం లోబో నేరుగా నామినేట్ కూడా అవుతాడు. లోబో సీక్రెట్ రూమ్‌లో ఉన్నాడు అనే విషయం ఎవరికీ తెలీదు. లోబో మాత్రం సీక్రెట్ రూమ్‌లో ఉండి అందరినీ గమనిస్తూ ఉన్నాడు. ఆ విషయం మాత్రం లోబోకి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఎవరు అతని గురించి ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుంది. అతని గేమ్‌ను ఎలా మార్చుకోవాలో కూడా తెలుస్తుంది.
ఇదీ చదవండి: సుఖీభవ యాడ్ శరత్ పై దాడి! తీవ్ర గాయాలు!
సోమవారం అనగానే బిగ్‌బాస్ ప్రేక్షకులకు పెద్ద పండగే అవుతుంది. ఎందుకంటే సన్‌డే ఇంట్లోని సభ్యులకు ఫన్ డే అయితే.. ప్రేక్షకులకు మాత్రం మన్ డే..ఫన్ డే అవుతుంది. నామినేషన్ల సమయంలో హౌస్‌లో జరిగే పరిణామాలను ఎవ్వరూ ఊహించలేదు. ఒక్కొక్కళ్లు తిట్టుకుంటారు. కొందరు అరుస్తారు. అసలు నిజాలు, అసలు రంగులు అన్నీ ఆ సమయంలోనే బయట పడతాయి. ఇక, ఈ వారం నామినేషన్స్ లిస్టులో ఉండబోయేది యానీ మాస్టర్, ఆర్జే కాజల్, సిరి హన్మంతు, నటి ప్రియ, మోడల్ జెస్సీ, లోబో, వీజే సన్నీ, సింగర్ శ్రీరామచంద్ర, జబర్దస్త్ ప్రియాంక సింగ్. వీళ్లు అందరూ ఎప్పుడూ నామినేషన్స్‌లో ఉండేవాళ్లే. ఎందుకంటే వీళ్లకి రెండోవారం నుంచి వాళ్ల వాళ్ల ఇష్యూస్ నడుస్తూనే ఉన్నాయి. వాళ్లు చెప్పుకునే కారణాలు కూడా చాలా మందిని అలరిస్తున్నాయి. కొందరైతే ఇలాంటి కారణాలకు కూడా నామినేట్ చేస్తారా అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.