‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ గ్రాండ్ ఫినాలేకు ఇంకా కొన్ని రోజుల దూరంలోనే ఉంది. అయితే బిగ్ బాస్ ఇప్పుడు ఫన్నీ టాస్కులతో ఇంట్లోని సభ్యులను ఆట పట్టిస్తున్నాడు. ఇప్పుడు ఇచ్చిన ఒక టాస్కు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. అదేంటంటే బిగ్ బాస్ హౌస్ లో జరిగిపోయిన ఒక సంఘటనను మళ్లీ రీక్రియేట్ చేయడం. అదేముందిలే అనుకోకండి.. అక్కడే ఇంకో మెలిక ఉంది. అందులో క్యారెక్టర్లు ఛేంజ్ చేశాడు బిగ్ బాస్. అవును మరి బిగ్ బాస్ తో మాములుగా ఉండదు కదా. అయితే అలా క్యారెక్టర్లు మార్చుకున్న హౌస్ మేట్స్ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఇప్పుడు షణ్ముఖ్, శ్రీరామచంద్ర చేసిని ఒక సీన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.
షణ్ముఖ్ మోడల్ జెస్సీలా.. శ్రీరామచంద్ర సిరి క్యారెక్టర్లు చేస్తున్నారు. అప్పటి సీన్ ను ఒకటి రీ క్రియేట్ చేస్తూ.. తలనొప్పిగా ఉన్న జేస్సీకి సిరి హెడ్ మసాజ్ చేస్తున్నట్లుగా ఉన్నారు. ఆ సమయంలో ‘అబ్బ ఎంత బాగా చేస్తున్నావే సిరి.. ఒక ముద్దివ్వే. అబ్బా నువ్ సింగిల్ అయితేనా’ అంటూ షణ్ముఖ్ ల్యాంగ్వేజ్, బాడీ ల్యాంగ్వేజ్ తో ఆకట్టుకున్నాడు. అయితే ముద్దివ్వు అనగానే శ్రీరామ్ కిస్ చేసుకోవడం కూడా ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఈ విషయాల్లో ఫన్ ఎంత ఉందో.. ఆ సందర్భాలను మిగిలిన ఇంటి సభ్యులు ఎలా అర్థం చేసుకున్నారు అనే కోణం కూడా ఉంది. వీళ్లు ఇదంతా ఫన్ అనుకున్నా ప్రేక్షకులకు ఇందులోని మరోకోణం కూడా అర్థంకాక మానదు. మరి బిగ్ బాస్ ఉద్దేశం కూడా అదే కావచ్చు అనేది టాక్. బిగ్ బాస్ ఇచ్చిన క్యారెక్టర్స్ ఛేంజ్ టాస్కుపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.