‘బిగ్ బాస్ 5 తెలుగు’ బుల్లితెర ప్రేక్షకులను తెగ అలరిస్తున్న గేమ్ షో. ఈ సీజన్‌లో ప్రేక్షకులు తలచింది ఒకటైతే.. బిగ్ బాస్ మరోటి తలుస్తున్నాడు. ట్విస్టులు, డ్రామా, కన్నీటి వీడ్కోలు అబ్బో ఒకటా రెండా హౌస్ అంతా హైవోల్టేజే. శనివారం, ఆదివారం నవ్వించి ఆఖర్లో ఏడుపులు, కేకలు, సవాళ్లు చాలా కొత్తగా నడుస్తోంది ఈ సీజన్ మాత్రం. ఎవ్వరూ ఊహించని విధంగా 7 ఆర్ట్స్ సరయుని ఎలిమినేట్ చేసి బిగ్ బాస్ అందరికీ షాక్ ఇచ్చాడు. సరయు ఎలిమినేట్ అయ్యాక కూడా ఇది నిజమేనా అని అనుమాన పడినోళ్లు చాలా మంది ఉన్నారు. ‘బిగ్ బాస్ బజ్’ ప్రోమో రిలీజ్ అయితే గానీ వాళ్లకి క్లారిటీ రాలేదు. ఎలిమినేషన్ విషంలో సరయుకి అన్యాయం జరిగిందంటూ అందరూ టాక్ మొదలెట్టేశారు. ఇదిలా ఉంటే అప్పుడే మొదటివారం అయిపోయి రెండో వారం కూడా వచ్చేసింది. అంటే సోమవారం నామినేషన్స్ ఉంటాయన మాట. ఈ వారం మరి నామినేషన్స్‌లో ఎవరు ఉండబోతున్నారో చూద్దాం.
గతవారం జరిగిన గొడవలు, సవాళ్లను బట్టి చూస్తే ఈ వారం నామినేషన్స్‌లో ఉండబోయేది నటి ఉమాదేవి, యానీ మాస్టర్, నటరాజ్ మాస్టర్, లోబో, ఆర్జే కాజల్, నటి ప్రియ, ప్రియాంక సింగ్. ఎవరు ఎందుకు ఉండబోతున్నారో విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఉమాదేవి.. ప్రియాంక సింగ్, యానీ మాస్టర్‌తో గొడవకు దిగింది కాబట్టి వారిలో ఒకరు నామినేట్ చేస్తారు. ఉమా తిరిగి యానీ మాస్టర్‌ని నామినేట్ చేసే అవకాశం లేకపోలేదు. నటరాజ్ మాస్టర్ ఇంకా అందరితో కలివిడిగా ఉండటం లేదు ఆ కారణం చేతగానీ, కొందరితోనే ఉంటున్నారు అన్న కారణం చెప్పి నామినేట్ చేస్తారు.
లోబో నామినేషన్స్‌లోకి రావడం ఒకింత ఆశ్చర్యమే. ఎందుకంటే హౌస్‌లో అజాతశత్రువుగా ఉన్నాడు లోబో. గత వారం సిరిహన్మంత్, లోబో చేసిన గొడవ డ్రామాని ఎత్తిచూపి ఎవరైనా నామినేట్ చేయచ్చు. ఆర్జే కాజల్ ఎందుకు నామినేట్ అయ్యిందని ఎవరూ వివరించాల్సిన పనిలేదు. సెట్- కట్ టాస్క్‌లో అందరికంటే ఎక్కువగా 5 కట్లు పడింది ఆర్జే కాజల్‌కే ఆ ఒక్క కారణం చాలదా తను కచ్చితంగా నామినేషన్స్‌లో ఉంటుందని చెప్పడానికి. నటి ప్రియ గతవారం యాని మాస్టర్‌తో కప్పు కడిగే విషయం దగ్గర గొడవ పడ్డారు. ఇప్పుడు ఆ కారణం చెప్పి ఎమోషనల్‌గా యానీమాస్టర్ ప్రియని నామినేట్ చేస్తారు. ఇక ప్రియాంక సింగ్ గతవారంలో కాస్త ఫైర్ అయింది. ఉమాదేవితో గట్టిగానే గొడవకు దిగింది. తర్వాత సారీ చెప్పి కౌగింలించుకున్నా గానీ, ఉమాదేవి ‘షటప్’ అన్న పదం అనడం నాకు నచ్చడం లేదంటూ నామినేట్ చేయచ్చు.
‘బిగ్ బాస్ 5 తెలుగు’ షోకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర కథనాలు, నామినేషన్, ఎలిమినేషన్ వివరాల కోసం సుమన్ టీవీ వెబ్‌సైట్‌ని ఫాలోఅవ్వండి.