సీజన్ స్టార్టింగ్ నుంచి ‘బిగ్ బాస్ 5 తెలుగు’ యాజమాన్యానికి నిరసన సెగలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా తెలుగు హీరోయిన్ మాధవీలత బిగ్ బాస్ పై విరుచుకుపడింది. ప్రతి ఎపిసోడ్ చూస్తూ తనదైన శైలిలో స్పందిస్తుంటుంది మాధవీలత. అయితే సిరి- షణ్ముఖ్ రిలేషన్ పై మాత్రం చాలా ఘాటుగానే స్పందించింది. బిగ్ బాస్ టీమ్ పద్ధతి మార్చుకోకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తానని.. కుదరకపోతే హైకోర్టుకైనా వెళ్తానంటూ వార్నింగ్ ఇచ్చేసింది. ఏంది మామా అంటూ హోస్ట్ నాగార్జున మీద కూడా పంచ్ డైలాగులు వేసింది.
ఏమయ్యా బిగ్ బాస్ సిగ్గులేని టీం.. ఏందయ్యా ఇదీ.. ఆ బిగ్ బాస్ హౌస్‌లో అరాచకం? ఒక ఆడపిల్లని బానిసను చేసి నవ్వకూడదు.. ఏడ్వకూడదు.. వంగకూడదు.. కూర్చోకూడదు అని మానసిక అత్యాచారం చేస్తుంటే.. ఎవడో పెళ్లాన్ని ఇంకొకడు డామినేట్ చేస్తుంటే.. వీకెండ్‌లో ఊపుకుంటూ వచ్చిన మా నాగ్ మామ ఏమో అబ్బా ఏంట్రా ఇది అంటూ వగలు పోయి.. వాళ్ల అమ్మ వద్దు అన్న హగ్‌లు ఇప్పిస్తూ.. మీ ఫుటేజ్ కోసం ఆఖరుకి నాగార్జునని కూడా దిగజార్చిన మీకు టీఆర్పీ లేక ఏడుస్తున్నారు. ఒక కన్నతల్లి మాటని విలువ లేకుండా చేసిన కూరుర్ని సపోర్ట్ చేస్తూ.. సభ్యసమాజానికి ఏం చెప్పాలి అనుకుంటున్నారో మా నాగ్ మామ. అసలు ఈ అరాచకం ఏంటండీ.. ఇలాంటి వెధవలకు బిగ్ బాస్ హౌస్‌లో చోటు ఒకటి. వాడికి కప్ తగలబెట్టి మీ బిగ్ బాస్ సెట్‌ని కూడా తగలబెట్టండి. ఇలాంటి వాడికి కిరీటం పెడితే మీ బిగ్ బాస్ కొంపకి ఫైర్ యాక్సిడెంట్ అయ్యి నెక్స్ట్ మినిట్ మొత్తం తగలబడిపోతుంది చూడండి.
అసలు సమాజానికి ఏం చూపిస్తున్నారు? యూత్‌లో హగ్స్ అండ్ కిస్‌లు తప్పేం కదా… పక్కోడి పెళ్లాన్ని హగ్ చేసుకోవచ్చు అంటున్నారు.. నాతో వాదిస్తున్నారు తప్పేంటని. స్నేహం ముసుగులో కామ కలాపాలు చూడలేకపోతున్నాం.. మీ బిగ్ బాస్ టీం చివరి ఎపిసోడ్ చూసి.. మీరు తీసుకునే నిర్ణయం సమాజానికి ఉపయోగకరమైన ఇంపాక్ట్ ఇవ్వకపోతే బిగ్ బాస్ షోపై డైరెక్ట్‌గా సుప్రీం కోర్టులో కేసు వేస్తారు. హైకోర్ట్‌కి కూడా వెళ్తాను. ఇది జోక్ కాదు.. చాలా సీరియస్‌గా చెప్తున్నా.. టైం పాస్‌కి టీవీ చూద్దాం అంటే.. అవమానాలే కనిపిస్తున్నాయి. పేరెంట్స్‌తో కలిసి చూడాలంటే సిగ్గుగా ఉంది. చెవిపై.. మెడపై.. హార్ట్‌పై ముద్దులు పెట్టుకుంటుంటే చూడటానికి ఇబ్బందిగా ఉంది. అడల్ట్ షో చూస్తున్నామా? అనే ఫీలింగ్ కలుగుతుంది. ఓటీటీలో పర్సనల్‌గా చూసే షోలా ఈ బిగ్ బాస్ ఉంది. బిగ్ బాస్ వరస్ట్ టీంని తగలబెట్టండి సార్.. వరస్ట్ హోస్ట్’ అంటూ మాధవీలత ఓవరాల్ గా కంటెస్టెంట్స్ దగ్గర నుంచి టీమ్, యాజమాన్యం, హోస్ట్ దాకా అందరినీ ఒక ఆట ఆడుకుంది. మరి మాధవీలత వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.