అంగన్ వాడీ కేంద్రంలో పిల్లలను తల్లిలాగా సంరక్షించడం అక్కడి ఉండే ఆయాల బాధ్యత. చాలా మంది ఆయాలు.. పిల్లల పట్ల తమ బాధ్యతను సంక్రమంగా నిర్వహిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. కానీ కొందరు మాత్రం పిల్లలు అల్లరి చేస్తున్నారని తీవ్రంగా గాయపరుస్తున్నారు. తాజాగా అమ్మ కావాలంటూ ఏడుస్తున్న ఓ మూడేళ్ల చిన్నారిపై అంగన్ వాడీ కేంద్రం సహాయకురాలు వాతపెట్టింది. భయపడి ఇంటికి పరిగెత్తిన ఆ పసివాడిని కొడుతూ తిరిగి అంగన్ వాడీ కేంద్రానికి తీసుకెళ్లింది.ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
అనంతపురం పట్టణంలోని కోవూరు నగర్ లో లక్ష్మి, సంగారెడ్డి అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఈశ్వర్ కృష్ణ అనే మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. అతడిని నిత్యం దగ్గర్లోని అంగన్ వాడీ కేంద్రంలో వదిలి పెడుతుంటారు. ఎప్పటిలాగే గురువారం కుమారుడిని అంగన్ వాడీలో వదిలిపెట్టారు. కొద్దిసేపటికి అమ్మా కావాలంటూ చిన్నారి ఏడుస్తుంటే.. అక్కడి సహాయకురాలు వంట గదిలోకి తీసుకెళ్లి కడ్డీతో మూతి మీద వాత పెట్టింది. ఆ పసివాడు బాధతో విలవిల్లాడుతూ సమీపంలోనే ఉన్న ఇంటికి పరిగెత్తాడు. అతడి వెంటపడిన ఆయా అక్కడే ఉన్న ఓ చెట్టు కొమ్మతో కొట్టుకుంటూ అంగన్ వాడీ కేంద్రాన్నికి తిరిగి తీసుకొచ్చింది.
శుక్రవారం ఉదయం కుమారుడి మూతి మీద వాతను గమనించాడు బాలుడి తండ్రి. అనంతరం అసలు విషయం తెలుసుకుని అంగన్ వాడీ కేంద్రానికి వెళ్లి ఆయాను ప్రశ్నించాడు. ఆమె సరైన సమాధానం చెప్పలేదు. అంతే కాక బాలుడి తల్లిదండ్రులపైనే ఎదురు తిరిగింది. చిన్నారి మూతిపై వాత మాత్రమే కాదు.. వీపు, తొడలపైనా కొట్టినట్లు చారలు పడ్డాయి. ఏం జరిగిందో విచారిస్తాం. చిన్నారిని కొట్టారన్న విషయంపై తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని ఐసీడీఎస్ అధికారి లలిత తెలిపారు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.