ఓ వ్యక్తి.. తన పిరికితనంతో నిండు జీవితాన్ని కోల్పోయాడు. తన ప్రేమ విషయాన్ని ఇంట్లో వారికి చెప్పకుండా.. వారు చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తరువాత ప్రేయసిని మరువలేక.. భార్యతో ఉండలేక నరకయాతన అనుభవించాడు. అలా పెళ్లైన రెండు నెలలకే దారుణ నిర్ణయం తీసుకున్నాడు.
ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వాటిలో ప్రేమ ఒకటి. ఎప్పుడు ఎవరి మధ్య ఎలా పుడుతుందో ఎవ్వరం చెప్పలేము. ఈ ప్రేమ కారణంగా బాగుపడిన వారు ఉన్నారు.. అదే విధంగా జీవితాన్ని నాశనం చేసుకున్న వారు ఉన్నారు. ముఖ్యంగా ప్రేమించిన వ్యక్తిని మరచిపోలేక.. మరొకరితో జీవితాన్ని పంచుకోలేక నరకయాతన పడే వారు చాలా మంది ఉన్నారు. మరికొందరు అయితే ప్రేమించిన వ్యక్తిని మర్చిపోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. తాజాగా ఓ వ్యక్తి అలాంటి దారుణ నిర్ణయమే తీసుకున్నారు. మనసు ఇచ్చిన ప్రేయసిని మర్చిపోలేక.. కట్టుకున్న భార్యతో మనస్ఫూర్తిగా కాపురం చేయలేక చివరకు చావే పరిష్కారంగా భావించి ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖ పట్నంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
విశాఖపట్నం లోని ఉక్కునగర్ కు చెందిన రుంజల్ కిరణ్ బాబు(33) ఎలమంచిలి మండలం రేగుపాలెం వద్ద ఉన్న ఓ ఆన్ లైన్ పోర్టల్ గోదాంలో సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాడు. అక్కడ పనిచేసే సమయంలో కిరణ్ ఓ యువతిని ప్రేమించాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు చెప్పలేదు. అయితే కిరణ్ ప్రేమ వ్యవహారం తెలియని తల్లిదండ్రులు.. పెళ్లి సంబంధాలు చూశారు. జనవరి 26న మరో యువతితో వివాహం జరిపించారు. పెళ్లైన కూడా కిరణ్ ప్రియురాలిని మరువలేక రాత్రులు నిద్రపోయేవాడు కాదు. ఆమెను కలిసేందుకు విశ్వప్రయత్నాలు చేశాడు. ఈ క్రమంలోనే ఆమె అచ్యుతాపురం మండలం వెదురువాడలో బంధువుల ఇంటి వద్ద ఉందని తెలుసుకుని సోమవారం రాత్రి అక్కడి వెళ్లాడు. పురుగు మందు తాగి, తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ప్రియురాలికి ఫోన్లో చెప్పాడు.
అనంతరం పురుగులు మందు తాగి కిరణ్ ఆత్మహత్యకు యత్నించాడు. ఇంతలోనే అక్కడి చేరుకున్న ప్రియురాలు.. కొన ఊపిరితో ఉన్న కిరణ్ బాబును మొదట అచ్యుతాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించింది. అక్కడి వైద్యుల సూచన మేరకు అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించి బతికించడానికి ప్రయత్నించింది. అయితే అప్పటికే అతడి ఆరోగ్య పరిస్థితి విషమించి.. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతిచెందాడు. కిరణ్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మరి.. ప్రేమ విషయంలో మనిషి ఇక్కడ.. మనస్సు అక్కడ ఉంచలేక ఇలా ఆత్మహత్యలకు పాల్పడుతున్న ప్రేమికుల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.