గత ఏడాది విజయవాడలోని కొత్త ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. యువతిని 30 గంటల పాటు గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
గత ఏడాది విజయవాడలోని కొత్త ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఉద్యోగం ఇప్పిస్తామని మభ్యపెట్టి.. యువతిని 30 గంటల పాటు గదిలో బంధించారు. అలా ఆమెను గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులు ముందు హాజరు పరిచారు. సుదీర్ఘ విచారణ అనంతరం తాజాగా విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కోర్టు ఇచ్చిన తీర్పుతో ముగ్గురు నిందితులు షాక్ గురయ్యారు.
విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రిలో పెస్ట్ కంట్రోల్ విభాగంలో దారా శ్రీకాంత్ అనే వ్యక్తి విధులు నిర్వహిస్తున్నాడు. అతడికి తాను నివాసం ఉండే కాలనీకి చెందిన యువతి(22)తో పరిచయం ఉంది. ఆమెకు మందబుద్ధి ఉండటంతో తల్లిదండ్రులు కొంతకాలం చికిత్స చేయించారు. ఓ రోజు ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని శ్రీకాంత్ యువతికి మాయమాటలు చెప్పాడు. అతడి మాటలు నమ్మిన ఆమె గత ఏడాది ఏప్రిల్ 19 రాత్రి ప్రభుత్వాసుపత్రికి వెళ్లింది. శ్రీకాంత్ ఆమెను అక్కడే ఓ గదిలో రాత్రికి ఉండమని సూచించాడు.
బాధితురాలు అక్కడ నిద్రిస్తుండగా శ్రీకాంత్ వచ్చి ఆమెను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు. అర్థరాత్రి దాటిన తరువాత అంటే ఏప్రిల్ 20న చెన్నా బాబూరావు అనే వ్యక్తి వచ్చి యువతిపై అత్యాచారం చేశాడు. అనంతరం అతని స్నేహితుడు జరంగుల పవన్ కల్యాణ్ సైతం అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దాదాపు 30 గంటల పాటు యువతిని బంధించి అత్యాచారం చేశారు. 2022 ఏప్రిల్‌లో ఘటన చోటుచేసుకోగా.. సెప్టెంబరులో న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. తాజాగా ఈ కేసులో విజయవాడ మహిళా కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నిందితులకు న్యాయస్థానం కఠిన శిక్ష విధించింది.
ఈ కేసులో విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఐ. శైలజాదేవి మంగళవారం తీర్పు ఇచ్చారు. ఏ1 గా ఉన్న శ్రీకాంత్ కు జీవితఖైదు, మరో సెక్షన్ కింద 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.7వేల జరిమానా విధించారు. అలానే ఏ2 గా ఉన్న బాబూరావుకు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.5వేల జరిమానా విధించారు. ఇక ఏ3 పవన్ కల్యాణ్‌కు 20 ఏళ్ల జైలు, రూ.5వేల జరిమానా విధించారు. ఇలా నిందితులకు శిక్ష పడటంలో ఫోరెన్సిక్ నివేదిక ముఖ్యభూమిక పోషించింది. మరి.. కోర్టు ఇచ్చిన తీర్పుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.