ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం నెలకొంది. దాంతో గన్నవరం ఎయిర్ పోర్ట్ లోనే జగన్ అరగంట పాటు వెయిట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం నెలకొంది. దాంతో గన్నవరం ఎయిర్ పోర్ట్ లోనే జగన్ అరగంట పాటు వెయిట్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి విశాఖకు బయలుదేరాల్సి ఉంది. విశాఖలో జీ20 సన్నాహక సదస్సుకు హాజరైన ప్రతినిధులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జగన్ పాల్గొనాల్సి ఉంది. ఈ క్రమంలోనే విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పర్యటన రద్దయినట్లేనని అందరు భావించారు. చివరకు నిపుణులు మరమ్మతులు చేసి ఫ్లైట్ రెడీ చేయడంతో ఆయన విశాఖకు బయలుదేరి వెళ్లారు.
సీఎం జగన్ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక లోపం నెలకొంది. దాంతో విశాఖ వెళ్లకుండానే జగన్ వెనుదిరగాల్సి వచ్చింది. దాంతో అరగంట పాటు గన్నవరం విమానాశ్రయంలోనే జగన్ వేచి చూశారు. నిపుణులు మరమ్మతులు చేసి ఫ్లైట్ రెడీ చేయడంతో ఆయన విశాఖకు బయలుదేరి వెళ్లారు. ఇక ఈ సంఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే బుధవారం సీఎం జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసి, రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలను చర్చించనున్నట్లు తెలుస్తోంది. రెండు వారాల వ్యవధిలోనే రెండవ సారి సీఎం జగన్ ఢిల్లీకి వెళ్తుండటంతో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది.