ఫిరంగిపురం మండలం మేరకిపూడికి చెందిన హెడ్ కానిస్టేబుల్ సత్యనారయణ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం స్వగ్రామం మేరికపూడికి తరలించారు. పలువురు పోలీసు ఉన్నతాధికారులు సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులర్పించారు.
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోయిన హెడ్ కానిస్టేబుల్ సూర్యనారాయణ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ పార్థివదేహాన్ని వారి స్వగ్రామం అయిన ఫిరంగిపురం మండలం మేరికపూడికి తరలించారు. పల్నాడు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ రవి శంకర్ రెడ్డి ఆదేశాల ప్రకారం నరసరావుపేట డీఎస్పీ విజయ భాస్కర్, నరసరావుపేట రూరల్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ భక్త వత్సల రెడ్డి, నరసరావుపేట రూరల్ సబ్ ఇన్ స్పెక్టర్ బాల నాగిరెడ్డి, పల్నాడు జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు మాణిక్యాలరావు హాజరై.. హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.