ఈ మధ్యకాలంలో వరుస అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. షార్ట్ సర్యూట్, రసాయనాలు, నల్లమందు వంటి వాటి కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవలే సికింద్రాబాద్ ప్రాంతంలోని ఓ కాంప్లెక్స్ భవనంలో అగ్నిప్రమాదం సంభవించి ఆరుగురు మరణించారు. నిన్న ఖమ్మం జిల్లాలో బాణ సంచాను పేల్చే సమయంలో గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు మరణించారు. తాజాగా సోమశిల కొండల్లో కూడా అగ్నిప్రమాదం జరిగింది.
ఈ మధ్యకాలంలో వరుస అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. షార్ట్ సర్యూట్, రసాయనాలు, నల్లమందు వంటి వాటి కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవలే సికింద్రాబాద్ ప్రాంతంలోని ఓ కాంప్లెక్స్ భవనంలో అగ్నిప్రమాదం సంభవించి ఆరుగురు మరణించారు. నిన్న ఖమ్మం జిల్లాలో బాణ సంచాను పేల్చే సమయంలో గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు మరణించగా.. దాదాపు పది మందికి గాయాలయ్యాయి. తాజాగా నెల్లూరు జిల్లాలోని సోమశిల కొండల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
బుధవారం రాత్రి నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిధిలో ఉన్న సోమశిల కొండల్లో కార్చిచ్చు రేగింది. రాత్రి సమయంలో కొండల్లో తలెత్తిన మంటలు గాలులతో భారీగా వ్యాపించాయి. వేసవి తీవ్రత అధికంగా ఉండటంతో అడవుల్లో ఉండే ఎండు గడ్డి కారణంగా మంటలు భారీగా వ్యాపించాయి. జలాశయానికి ఉత్తరం వైపు ఉన్న కొండల్లో ఈ మంటలు వ్యాపించాయి. ఈ విషయం తెలుసుకున్న ఆత్మకూరు రేంజర్ రామకొండారెడ్డి.. సిబ్బంది మంటలు ఆర్పేందుకు పంపినట్లు ఆయన తెలిపారు. ఘటన ప్రాంతంలోకి చేరుకున్న సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకోచ్చారు.
సోమశిలకు ఇరువైపులా కొండల్లో వన్యప్రాణుల సంచారం కూడా ఉంది. తాగునీటి కోసం జలాశయం కోనల్లోకి ఇవి వస్తూ ఉంటాయి. ఈ కొండల్లో మంటలు విస్తరిస్తే వన్యప్రాణులకు ముప్పు కలుగుతుంది. తరచూ సోమశిల కొండల్లో మంటలు రేగుతున్నాయి. దీంతో అటవీ సంపదకు నష్టం జరుగుతుందని స్థానికులు అంటున్నారు. ఆ మంటల ధాటికి జంతువులు, వన్యమృగాలు ఊర్లలోకి వస్తున్నాయని సమీప గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సోమశిల కొండల్లో చెలరేగిన మంటలను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు.