రైతే రాజు.. అన్నదాత దేశానికి వెన్నుముక.. స్టేజీ ఎక్కి ఉపన్యాసం ఇచ్చే ఏ నాయకుడి నోటి వెంట అయినా సరే ఖచ్చితంగా వినిపించే మాటలివే. నోరు తెరిస్తే.. తమ ప్రభుత్వాలు అన్నదాతల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చాయని చెప్తారు. కానీ వాస్తవంగా చూస్తే.. పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంటుంది. దేశానికే అన్నం పెట్టే రైతన్నకు మూడు పూటలా తినిడానికి తిండి దొరకదు అంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహిచుకోవచ్చు. వ్యవసాయం రైతుకు వ్యసనంగా మారింది. ప్రభుత్వాలు మోసం చేసినా.. ఆఖరికి ప్రకృతి కూడా సహకరించకపోయినా సరే.. ప్రతి ఏటా గంపెడు ఆశతో లక్షలు లక్షలు అప్పులు చేసి మరి వ్యవసాయం చేస్తాడు. ఆఖరికి రుణాల ఊబి నుంచి బయటపడలేక ఆత్మహత్య చేసుకుంటాడు. రైతులకు సంబంధించిన ఇలాంటి విషాద గాధలు ఎన్నో. తాజాగా రైతు దైన్య పరిస్థితికి అద్దంపట్టే సంఘటన ఒకటి వెలుగు చూసింది. ఆ వివరాలు..
తాజాగా ఓ నిరుపేద రైతు.. ఆర్థిక పరిస్థితి బాగాలేక.. తన కుమారులనే కాడెద్దులుగా మార్చి వ్యవసాయం చేసిన హృదయ విదారకరమైన సంఘటన చిత్తూరు జిల్లాలో కనిపించింది. ఆ వివరాలు.. జిల్లాలోని వి.కోట మండలం, కుంబార్లపల్లె గ్రామంలో రైతు సమీవుల్లా తమ కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. గ్రామంలో తనకున్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. సమీవుల్లాకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే వీరిని గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలో చదివిస్తున్నాడు. సమీవుల్లా పేద రైతు కావడంతో అంతంత మాత్రమే ఆదాయం వచ్చేది. వచ్చిన ఆదాయంతో కుటుంబ పోషణ చేస్తూనే తన ముగ్గురు పిల్లల చదువులకు అవసరం అయ్యే మొత్తాన్ని సమకూర్చేవాడు.
అయితే కరోనా కారణంగా గత రెండేళ్ల నుంచి సమీవుల్లా తీవ్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. తనకున్న వ్యవసాయ పొలంలో వివిధ రకాల ఆకుకూర పంటలు వేసి దాని ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకు వచ్చేవాడు. కరోనా వ్యాప్తి సమయంలో కుటుంబ పోషణ కోసం చేసిన అప్పులు కొంచెం కొంచెం తీర్చే ప్రయత్నం చేశాడు. ఇక పంటకు చీడపీడలు, తెగులు పట్టిన సమయంలో మందులు సైతం కొనేందుకు కూడా సమీవుల్లా తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
ఇక కుటుంబ పోషణ కోసం చేసిన అప్పులే తీర్చలేని స్ధితిలో ఉన్న సమీవుల్లా.. పొలం దున్నేందుకు ట్రాక్టరుకు సొమ్ము కేటాయించలేక పోయాడు. కాడెద్దులతో దున్నేందుకు కూడా సొమ్ము కేటాయించలేని సమీవుల్లా, తన ఇద్దరు కుమారులు, కుమార్తెల సహాయంతో పొలం దున్ని వ్యవసాయం చేయాలని భావించి, కాడెద్దుల స్ధానంలో కుమారులతో వ్యవసాయ పొలంను దుక్కి దున్నుతున్నాడు. ఈ హృదయ విదారక ఘటన చూసిన కొందరు స్ధానికులు వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది.
వ్యవసాయంపై మమకారంతో తనకు స్ధొమత లేకున్నా పిల్లల సాయంతో కాడిపట్టి నాగలితో దుక్కి దున్ని, పాదులు చేయించాడు సమీవుల్లా. అంతే కాకుండా బురదమట్టిలో సైతం పిల్లలసాయంతో నాగలితో దున్నడం స్ధానికులకను కన్నీళ్ళు పెట్టించింది. తమ తండ్రి నిస్సహాయతను గమనించిన కుమారులు, కుమార్తే మేము ఉన్నాం అంటు తండ్రి సమీవుల్లాకు అండగా నిలబడి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇక గతంలో కరోనా టైమ్‌లో సొంత జిల్లా చిత్తూరు వచ్చిన రైతు నాగేశ్వరరావు మహల్ రాజపల్లిలో తన కుమార్తెలతో పొలం దున్నించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నటుడు సోనూ సూద్ పెద్ద మనసుతో వారికి ట్రాక్టర్ కొనిచ్చారు. గంటల వ్యవధిలో రైతు కుటుంబానికి ట్రాక్టర్ అందజేశారు. మరి ప్రస్తుతం సమీవుల్లాను ఎవరైనా ఆదుకుంటారో లేదో చూడాలి. ప్రభుత్వం ఇతనికి సాయం చేస్తే బావుంటుందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.