దురంతో ఎక్స్ ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలో ఒక్కసారిగా దురంతో ఎక్స్ ప్రెస్ రైలు బోగీలోంచి మంటలు చెలరేగాయి. బెంగళూరు నుంచి హౌరా వెళ్తుండగా.. ఉన్నట్టుండి ఎస్-9 బోగిలో మంటలు చెలరేగాయి. దీంతో రైలుని కుప్పం రైల్వేస్టేషన్ లోనే నిలిపివేశారు. వెంటనే ప్రయాణికులు రైలు లోంచి దూకి పరుగులు తీశారు. రైల్వే సిబ్బందికి సమాచారం అందించడంతో సిబ్బంది చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో భారీ ప్రమాదం తప్పింది. ప్రమాదం గురించి పూర్తి సమాచారం రావాల్సి ఉండగా.. మంటలు ఎలా వ్యాపించాయి అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.