ఇటీవల కొన్ని రోజుల క్రితం తిరుమల శ్రీవారి ఆలయంలోని ఆనంద నిలయాన్ని ఓవ్యక్తి మొబైల్ ద్వారా వీడియో తీసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా వీడియో చిత్రీకరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి కీలక విషయాలు రాబట్టారు.
ఇటీవల కొన్ని రోజుల క్రితం తిరుమల శ్రీవారి ఆలయంలోని ఆనంద నిలయాన్ని ఓవ్యక్తి మొబైల్ ద్వారా వీడియో తీసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలానే పోలీసులు అధికారులు, టీటీడీ కూడా వెంటనే స్పందించింది. మొబైల్ లో శ్రీవారి ఆలయంలో వీడియో తీసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని విచారించిన పోలీసులకు ఆసక్తికరమైన విషయం తెలిసింది.
తెలంగాణ రాష్ట్రం కరీనంగర్ కు చెందిన లింగారెడ్డి కుమారుడు రాహుల్ రెడ్డి(19) ఈ వీడియో తీసినట్లు పోలీసులు గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన గురించి శుక్రవారం పోలీసులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. నిందితుడు ఆకతాయితనంతోనే ఆ పనిచేసినట్లు తెలిపారు. “అతడు గుంటూరులో సీఏ ఫస్టియర్ చదువుతున్నాడు. ఆలయాలను సందర్శించిన సమయంలో మొబైల్ లో వాటిని వీడియో తీసి స్టేటస్ లో పెట్టుకునే వాడు. అందులో భాగంగానే మే 7న సాయంత్రం తన సెల్ ఫోన్ లో తీసుకుని శ్రీవారి దర్శనానికి వెళ్లాడు. భద్రతా సిబ్బంది తనిఖీలు దొరక్కుండా సెల్ ఫోన్ ను భద్రంగా దాచుకుని తీసుకెళ్లాడు.
అలా ఆలయంలోకి వెళ్లిన తరువాత రాహుల్.. అర్ధరాత్రి 12.20 కి స్వామిని దర్శించుకుని మరుసటి రోజు ఉదయం బయటకు వచ్చాడు. గర్భాలయం చిత్రీకరణ చేయలేదు. బంగారు బావి వద్ద నుంచి వీడియో చిత్రీకరించాడు. అలా తీసిన వీడియోను తన స్టేటస్ పెట్టుకోవడంతో పాటు సోదరికి షేర్ చేశాడు. అనంతరం రైలులో స్వస్థలానికి చేరుకున్నాడు. ఇంతలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో..డిలీట్ చేసి.. ఫోన్ ను స్వీచ్చాఫ్ చేసుకున్నాడు. అతడు ఆకతాయినంతోనే వీడియో చిత్రీకరించాడు” అని తిరుపతి అదనప్పు ఎస్పీ ముని రామయ్య తెలిపారు. మరి.. తిరుమల ఘటనపై పోలీసులు తెలిపిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
తిరుమలలో మరోసారి భద్రత వైపల్యం..
సెల్ ఫోన్‌తో తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రవేశించిన భక్తురాలు.. pic.twitter.com/rkX36sbwxV
— Dharani Pilli (@DharaniPilli) May 8, 2023