కొవ్వూరులో విద్యా దీవెన నిధుల విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తన ప్రసంగంతో అందరి దృష్టిని ఆకర్షించింది ఓ విద్యార్థిని. తాజాగా ఆమెకు సీంఎ జగన్ ఊహించని సాయం చేశారు. ఆ వివరాలు..
వేదిక మీద నిలబడి.. కొన్ని వందల మందిని చూస్తూ.. మనసులోని మాటను నిర్భయంగా చెప్పగలిగే టాలెంట్ అందరికి ఉండదు. చాలా మంది ఇంట్లో, తమ సన్నిహితుల దగ్గర గలగలా మాట్లాడుతుంటారు. కానీ నలుగురిలో మాట్లాడమంటే మూగ శిల్పాలు అవుతారు. చాలా కొద్ది మంది మాత్రమే ఎలాంటి స్టేజీ ఫియర్ లేకుండా.. తమ ఎదురుగా ఉన్న జన సంద్రాన్ని చూస్తూ.. అనర్గళంగా మాట్లాడగలరు. తమ మాటలతో ఎదుటి వారి చేత కంటతడి కూడా పెట్టించగలరు. ఇలాంటి సంఘటన ఒకటి రెండు రోజుల క్రితం ఏపీలో చోటు చేసుకుంది. కొవ్వూరులో జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన నిధుల విడుదల సందర్భంగా దివ్య అనే విద్యార్థిని.. అద్భుతంగా మాట్లాడింది. తన కష్టాలు.. ప్రభుత్వం నుంచి తనకు అందుతున్న సాయం గురించి చెప్తూ భావోద్వేగానికి గురయ్యింది. ఆమె మాటలకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సైతం కన్నీరు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.
వేదిక మీద అద్భుతంగా మాట్లాడి.. అందరి చేత ప్రశంసలు పొందిన దివ్యకు సీఎం జగన్ నుంచి ఊహించని సాయం అందింది. ఆమె కష్టాలు విని చలించిన జగన్.. దివ్య కుటుంబానికి ఇంటి పట్టా అందజేశారు. దివ్య కుటుంబం కష్టాలు విని చలించిన సీఎం జగన్.. ఆమెకు సాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ కె.మాధవీలత నుంచి దివ్యకు పిలుపువచ్చింది. కలెక్టర్ ఆఫీస్‌కు వచ్చి కలవాల్సిందిగా సూచించారు. దాంతో దివ్య తన గ్రామ సర్పంచ్ , ఇతర వైసీపీ నాయకులతో కలిసి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లింది.
విద్యార్థి దివ్య కుటుంబానికి ఇంటి స్థలం కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు. అతి త్వరలో మంత్రి చేతుల మీదుగా ఇంటి పట్టా అందజేస్తామని తెలిపారు. అలానే దివ్య ఉన్నత చదువులు చదివేందుకు సాయం చేయడమే కాక.. ఆమెకు మంచి ఉద్యోగం అవకాశం కల్పించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇక శుక్రవారం అమరావతిల సుమారు 50 వేల పైచిలుకు మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందించిన సంగతి తెలిసిందే. సీఆర్డీఏ పరిధిలో.. ఈ ఇళ్ల స్థలాలు కేటాయించారు. అంతేకాక 5024 మందిటి టిడ్కో ఇళ్ల పత్రాలను కూడా అందజేశారు. విద్యార్థిని దివ్యకు సీఎం జగన్ చేసిన సాయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.