మత సామరస్యానికి ప్రతీక మన భారత దేశం. అన్ని మతాల వారు, కులాల వారు అన్నదమ్ముల్లా కలిసిమెలసి ఉంటున్నారు. ఇక ఇతర మతాల వారి దేవులను గౌరవిస్తుటారు. మరికొందరు అయితే పూజలు, ప్రార్ధనల కూడా చేస్తుంటారు. ఇతర మతల దేవాలయాలు , మసీదు, చర్చీల నిర్మాణలకు, ఇతర కార్యక్రమాలకు విరాళలు కూడా ఇస్తుంటారు. తాజాగా చెన్నైకి చెందిన ముస్లిం దంపతులు టీటీడీకీ భారీ విరాళం ఇచ్చారు. ఈ విరాళాన్ని టీటీడీ ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. వివరాల్లోకి వెళ్తే..
తమిళనాడులోని చెన్నైకి చెందిన సుబీనాబాను, అబ్ధుల్ ఘనీ దంపతులు తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.1.02 కోట్లు విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల కల్యాణ మండపంలో దాతలు ఈ విరాళం చెక్కును టీటీడీ ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. ఈ విరాళంలో రూ.15 లక్షలు ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకి, రూ.87 లక్షలు ఇటీవల తిరుమలలో ఆధునీకరించిన శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలో నూతన ఫర్నిచర్, వంటశాలలో పాత్రల కోసం అందించారు. ఇక తిరుమల దర్శన సమయం గురించి వస్తే.. ఇక్కడ భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 24 కంపార్ట్ మెంట్లు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. సోమవారం అర్ధరాత్రి వరకు 67 వేల మందికి పైగా దర్శించుకున్నారు. ఇక నిన్న స్వామి వారి హుండీ ఆదాయం రూ.5.71 కోట్లు వచ్చింది. మరి.. స్వామి వారికి విరాళం అందించి.. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ ముస్లిం దంపతులపై మీ అభిప్రాయాను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Muslim couple gestures to TTD, donate Rs 1.02 crore to the trust which manages the hills shrine of Tirumala Tirupati. The Muslim family from Chennai are ardent devotees of Lord Venkateswara. #AndhraPradesh pic.twitter.com/ergqhAfGq8
— Ashish (@KP_Aashish) September 21, 2022