ప్రపంచంలో తెలుగు భాషకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అలాగే తెలుగు వారు ఎక్కడ ఉన్నా ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఇలా ప్రపంచంలోని అనేక దేశాల్లో తెలుగు వారు కీలక పదవుల్లో స్థిరపడి ఉన్నారు. మన దేశంలో సైతం అనేక ప్రాంతంలో వివిధ హోదాల్లో తెలుగు వారు ఉన్నారు. తెలుగు వాడి పవర్ ఏమిటో దేశానికి చాటి చెప్పిన వ్యక్తుల ఎందరో ఉన్నారు. నేటికీ ఐఏఎస్ అధికారులుగా ఇతర రాష్ట్రాల్లో మన తెలుగు వారు విధులు నిర్వహిస్తోన్నారు. అక్రమార్కుల, అవినీతిపరుల గుండెల్లో నిద్రపోతున్నారు. అలాంటి యువ తెలుగు ఐఏఎస్ అధికారే కృష్ణ తేజ. ఈయన కేరళ రాష్ట్రంలోని అలెప్పీ జిల్లా కలెక్టర్ గా ఉన్నారు.
ఈ తెలుగోడి దెబ్బకు అక్కడి మాఫీయా విలవిల్లాడిపోతుంది. కేరళలోని అలెప్పీ జిల్లాలో పచ్చటి నేలపై కార్పొరేట్ కన్నుపడింది. వీరి దెబ్బకి రూల్స్ కూడా రూట్ నుంచి తప్పుకున్నాయి. పచ్చని చెట్లు పోయి.. విల్లా పేరుతో ఓ కాంక్రీట్ జంగిల్ మొలిచింది. అక్రమంగా నిర్మించిన ఆ రిసార్ట్ మొత్తం విలువ రూ.200 కోట్లకు పైనే ఉంటుంది. తీర ప్రాంత చట్టం ప్రకారం ఆ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. అయినా క్యాపికో అనే కంపెనీ అక్కడ ఈ నిర్మాణాలు చేపట్టింది. ఆ కట్టడాలకు అధికారులు కూడా అనుమతులు ఇచ్చేశారు. అయితే ఈ నిర్మాణాలపై ఐదుగురు యువ మత్స్యకారులు అభ్యతరం వ్యక్తం చేస్తూ కోర్టు మెట్లు ఎక్కారు.
వీరికి ప్రకృతి ప్రేమికులు కూడా తోడవ్వడంతో హైకోర్టులో ఈ యువకులు విజయం సాధించారు. 2013లో ఆ రిసార్ట్‌ను కూల్చేయాలని హైకోర్టు జారీ చేసింది. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ సదరు కంపెనీ సుప్రీం కోర్టుకు వెళ్లింది. కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలున్నా.. వాటిని అమలు చేసేందుకు ఏ అధికారి కూడా ధైర్యం చేయలేకపోయారు. రిసార్ట్ వైపు వెళ్లే ప్రయత్నం చేస్తే చాలు పై స్థాయి నుంచి ఫోన్లు వచ్చేవి. అటు వైపు వెళ్లొద్దని హెచ్చరికలు వచ్చేవి.
సరిగ్గా ఇదే సమయంలో తెలుగు బిడ్డ కృష్ణ తేజ అలెప్పీ కలెక్టర్ బాధ్యతలు స్వీకరించారు. క్యాపికో రిసార్ట్ ఫైల్ కంప్లీట్ గా స్టడీ చేశారు. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన కూడా ఇంకా కూల్చివేతలు జరగలేదని గ్రహించారు. కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి.. ఎట్టి పరిస్థితుల్లోనూ కూల్చేయాల్సిందేనని ప్రభుత్వానికి తేల్చిచెప్పారు. జేసీబీల సాయంతో అక్రమసౌధాన్ని కూల్చి వేశారు. అంతేకాకుండా ఆ కూల్చివేత ఖర్చు కూడా పూర్తిగా క్యాపికో యాజమాన్యమే భరించేలా చేశారు. 2018లో కేరళలో వరదలు వచ్చినప్పుడు కృష్ణతేజ ఆ ప్రాంతంలో సబ్ కలెక్టర్ గా ఉన్నారు.
సహాయక చర్యల్లో క్షేత్ర స్థాయిలో ముందుండి అధికారులతో పనిచేయించారు. ఎప్పటికప్పుడు బాధితులతో మాట్లాడుతూ.. తానున్నానంటూ భరోసా ఇచ్చారు. ఇలా అనేక కార్యక్రమాల్లో ముందుడి అక్కడి ప్రజల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు తెలుగు బిడ్డ కృష్ణ తేజ. అలా ఓ వైపు ప్రజలకు సేవ చేస్తూనే మరొకవైపు అవినీతి పరుల విషయంలో కృష్ణ తేజ వెనక్కి తగ్గడం లేదు. అక్రమాలు జరిగితే ఊరుకునేది లేదని కృష్ణ తేజ తేల్చి చెప్పారు.
Alappuzha Dist Collector VR Krishna Teja says, “Building owners are bearing cost of demolition. As per records, 2.9396 hectares of land encroached by resort owners, & govt acquired the land a week before. All 54 villas are going to be demolished. Public fund won’t be used for it” https://t.co/OtCuU9vZfd pic.twitter.com/nlJPeD2ToK
— ANI (@ANI) September 15, 2022
#WATCH | Kerala: Demolition of Kapico Resort underway at Panavalli Nediyathuruth in Alappuzha following the Supreme Court order of its demolition for Coastal Regulation Zone (CRZ) violations. pic.twitter.com/zQ21zEqIAG
— ANI (@ANI) September 15, 2022