నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం లేదు. బాలయ్యకున్న మాస్ ఫాలోయింగ్ మరే ఇతర హీరోకు లేదనడంలో అతిశయోక్తి కాదు. ఇక అభిమానులను ఆదరించే విషయంలో బాలయ్య ప్రవర్తించే తీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తోంది. అభిమానులు కోరితే చాలు.. వారి ఇంటికి వెళ్లి.. పలకరించి.. కుదిరితే భోజనం కూడా చేస్తారు. సరదాగా పలకరిస్తారు. అంత బాగా కలిసిపోతారు. ఇక బాలయ్య గురించి తెలిసిన వారు ఆయన ఎంతో భోళా మనిషి అని చెప్తారు. కోపం ఎక్కువే.. ప్రేమ కూడా ఎక్కువే అంటారు. ఈ క్రమంలో బాలయ్య ఓ అభిమాని కుమార్తె వివాహానికి హాజరయ్యి.. నూతన దంపతులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలుతోంది. ఆ వివరాలు..
బాలాకృష్ణ ఆదివారం అనంతపురంలో సందడి చేశారు. జిల్లా అభిమాన సంఘం అధ్యక్షుడు గౌస్ మొహిద్దీన్ కుమార్తె వివాహానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతపురంలోని ఎంవైఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన పెళ్లికి బాలకృష్ణ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. బాలయ్య వస్తున్నారని తెలియడంతో.. అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇక బాలయ్య రాకతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. పెళ్లికి హాజరైన బాలకృష్ణ నూతన వధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలుతోంది. బాలయ్య చేసిన పనిపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు.