ఒకప్పుడు బెండపూడి అనే ఊరు ఎక్కడుందో పెద్దగా ఎవరికీ తెలియదు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో ఉందన్న విషయం ఈ జిల్లాలో ఉండే చాలా మందికి తెలియదు. అలాంటిది ఈరోజు ఏపీ, తెలంగాణలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా ఆ ఊరి గురించి మాట్లాడుకుంటున్నారంటే ఆ క్రెడిట్ ఏపీ సీఎం జగన్ ది, బెండపూడి పాఠశాల విద్యార్థులది, ఆ విద్యార్థులకి ఇంగ్లీష్ నేర్పిన టీచర్ ది. నేర్పడం, నేర్చుకోవడం, టాలెంట్ ని గుర్తించడం ఈ మూడూ కూడా చాలా ముఖ్యం. మాష్టారు నేర్పించారు, విద్యార్థులు నేర్చుకున్నారు, జగన్ మాష్టారు వారిని గుర్తించారు, ప్రోత్సహించారు. బెండపూడి విద్యార్థుల ఇంగ్లీష్ టాకింగ్ స్కిల్స్ కి ఇండియా ఏంటి అమెరికా లాంటి దేశాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి.
అసలు ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు పాఠాలే సరిగా చెప్పరు అన్న స్టేజ్ నుండి పిల్లల్ని చదివిస్తే ప్రభుత్వ స్కూల్లోనే చదివించాలి అన్న స్థితికి జనం వచ్చారంటే దానికి బెండపూడి వారి కృషి ఎంతో ఉంది. బెండపూడి వారి ప్రతిభ ఈరోజు ఆస్ట్రేలియా వరకూ వ్యాపించింది. బెండపూడి ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు.. అమెరికన్ స్లాంగ్ లో మాట్లాడుతున్న వీడియోలు, సీఎం జగన్ ని కలిసి జగన్ తో మాట్లాడిన వీడియోలు ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉండే వాళ్ళు చూశారు. యూట్యూబ్ లో ఉన్న వీడియోలు చూసి ఇంప్రెస్ అయిన ఆస్ట్రేలియా దంపతులు ఇండియా వచ్చారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఉండే వినోద్, వీవీఎన్ కుటుంబ సమేతంగా గురువారం బెండపూడి పాఠశాలను సందర్శించారు.
ప్రసాద్ మాష్టారు.. అమెరికన్ యాక్సెంట్ లో మాట్లాడడం విద్యార్థులకు ఎలా నేర్పించారో అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఇంగ్లీష్ లో మాట్లాడిన మాటలకి ఆస్ట్రేలియన్ మహిళ ఇంప్రెస్ అయ్యారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ప్రోగ్రాం విధానాన్ని పరిశీలించేందుకు ఆస్ట్రేలియా నుంచి కాకినాడ జిల్లాకు వచ్చినందుకు కలెక్టర్ కృతికా శుక్లా సంతోషం వ్యక్తం చేశారు. బెండపూడి మాదిరిగానే జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకి.. పైలెట్ ప్రాజెక్ట్ కింద తుని నియోజకవర్గంలో ప్రారంభించిన రీడ్ నెస్ ఇనీషియేటివ్ ఫర్ సిచ్యువేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని అమలుచేస్తున్నందుకు జిల్లా కలెక్టర్ ను అభినందించారు వినోద్, వీవీఎన్ దంపతులు.
హైదరాబాద్ కి చెందిన వినోద్ ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. అక్కడ ఆస్ట్రేలియాకి చెందిన వీవీఎన్ అనే మహిళను వివాహం చేసుకున్నారు. యూట్యూబ్ లో బెండపూడి విద్యార్థుల వీడియోలు చూసి ఇంప్రెస్ అయ్యి ఇవాళ కాకినాడలో ఉన్న బెండపూడి ఉన్నత పాఠశాలకు వచ్చారు. బెండపూడికి ఒక చిరునామా వచ్చిందంటే, ఈ స్థాయిలో గుర్తింపు వచ్చిందంటే దానికి కారణం ప్రభుత్వ పాఠశాలలకు విలువ తెచ్చిన జగన్ దే. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టి ఇవాళ ఏపీ ఖ్యాతిని అమెరికా, ఆస్ట్రేలియా వరకూ వ్యాపింపజేశారు. మరి బెండపూడి విద్యార్థులు ఇంగ్లీష్ యాక్సెంట్ కి ఇంప్రెస్ అయి ఇండియా వచ్చిన ఆస్ట్రేలియా దంపతులపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.