క్రీడా ప్రపంచంలో భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ లకు ఉన్న క్రేజే వేరు. ఈ దాయాది దేశాల మధ్య మ్యాచ్ స్టార్ట్ అవుతోంది అంటే చాలు ప్రపంచం మెుత్తం మనవైపే చూస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. అయితే మరి కొన్ని గంటల్లో ఆసియా కప్ 2022లో భాగంగా భారత్-పాక్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. మరిన్ని వివరాల్లోకి వెళితే.. మరి కొన్ని గంటల్లో ఆసియా కప్ మెుదలు కానుంది. ఈ క్రమంలో తమ సత్తా ఏంటో చూపించాలని ప్రతీ జట్టు ఆరాటపడుతూ ఉంటుంది. దానికి అనుగుణంగానే ప్రాక్టీస్ ను ప్రారంభించాయి. ఇక భారత్ పాక్ మ్యాచ్ కోసం వరల్డ్ వైడ్ గా ఉన్న క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే ఇరు జట్లను గాయాలు కలవర పెడుతున్నాయి. గాయం కారణంగా పాక్ స్పీడ్ స్టర్ షాహిన్ అఫ్రిది ఆటకు దూరం కాగా తాజాగా మరో ఆటగాడు మహ్మద్ వసీమ్ వెన్ను నొప్పితో ఈ టూర్ మెుత్తానికే దూరం అయినట్లు పాక్ యాజమాన్యం తెలిపింది. క్రికెట్ లో కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. మ్యాచ్ కు ముందు ఇరుజట్ల సారథులు విలేకరుల సమావేశానికి వచ్చి జట్టుకు సంబంధించిన బలా బలాల వివరాలను పంచుకోవడం సహజం. అందులో భాగంగానే ఇండియా కెప్టెన్ రోహిత్ స్థానంలో వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ప్రెస్ మీట్ కు రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. కేఎల్ రాహుల్ మాట్లాడుతూ..'' పోయిన టీ20 ప్రపంచ కప్ మెుదటి మ్యాచ్ లోనే మేం పాక్ పై పరాజయం పొందాం. దానికి ఇప్పుడు మేం ప్రతీకారం తీర్చుకుంటాం. అయితే పాకిస్తాన్ తో ఇలాంటి టోర్నీల్లో ఆడటం తప్ప ద్వైపాక్షిక సిరీస్ లు ఆడటం లేదు. దాంతో దాయాది దేశంతో మ్యాచ్ అంటే సహజంగానే అంచనాలు ఉంటాయి. మేం అవన్నీఆటలో భాగంగానే చూస్తాం. ఇక ఒక గొప్ప బౌలర్ బౌలింగ్ ను మేం మిస్సవుతున్నాం. షాహిన్ అఫ్రిది త్వరగా గాయం నుంచి రికవరీ కావాలని కోరుకుంటున్నా'' అని వెల్లడించాడు. అయితే ఇది ఇలా ఉండగా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రెస్ మీట్ కు ఎందుకు రాలేదని క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అతడికి ఏమైనా ఆనారోగ్యం వచ్చిందా? లేగా గాయం అయిందా? అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. మరి కేఎల్ రాహుల్ ప్రెస్ మీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. #WATCH | Dubai: Cricketer KL Rahul says, "...We always look forward to India-Pakistan clash as we don't play each other anywhere else but these big tournaments. So, it's always an exciting time & a great challenge for all of us to compete against a team like Pak..."#AsiaCup2022 pic.twitter.com/7ul1SvfCdT — ANI (@ANI) August 26, 2022 ఇదీ చదవండి: Asia Cup 2022: పాకిస్థాన్‌కు భారీ ఎదురుదెబ్బ! ఇదీ చదవండి: సునామీ ఇన్నింగ్స్‌తో తన టీమ్‌ను ఛాంపియన్‌గా నిలిపిన మనీష్ పాండే! 17 బంతుల్లోనే..