క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్‌కు సర్వం సిద్ధమైంది. నేడు(శనివారం, ఆగస్ట్ 27) శ్రీలంక-అఫ్ఘానిస్థాన్ మ్యాచ్‌తో ఆసియా కప్ సమరానికి తెరలేవనుంది. ఆ వెంటనే ఆదివారం దాయాదుల పోరు. ఇప్పటికే ఇరుజట్లు ప్రాక్టీస్‌లో మునిగితేలుతున్నాయి. కానీ.. సరిగ్గా మ్యాచ్‌కు ఒక రోజు ముందు పాకిస్థాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే మోకాలి కారణంగా ఆ జట్టు ప్రధాన పేసర్ షాహీన్ షా అఫ్రిదీ జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. ఇదే పాక్‌కు భారీ దెబ్బ అని అనుకుంటున్న తరుణంలో తాజాగా మరో పేసర్ మొహమ్మద్ వసీమ్ జూనియర్ వెన్నునొప్పితో ఆసియా కప్‌కు దూరమయ్యాడు. దీంతో పాకిస్థాన్‌పై దెబ్బ మీద దెబ్బ పడినట్లు అయింది. ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఎదురుచూస్తున్న తరుణంలో ఇలా ఇరు జట్లలో మంచి మంచి ఆటగాళ్ల గాయాలపాలై మ్యాచ్‌కు దూరమవుతుండడంపై క్రికెట్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఇప్పటికే టీమిండియా స్టార్ బౌలర్ జప్ప్రీత్ బుమ్రా, యంగ్ పేసర్ హర్షల్ పటేల్ గాయాల కారణంగా ఆసియా కప్‌కు దూరంగా ఉన్నారు. అలాగే పాకిస్థాన్ టీమ్‌లో షాహీన్ అఫ్రిదీ, వసీమ్ జూనియర్ దూరమయ్యారు. బిగ్ ప్లేయర్స్ ఉంటే భారత్-పాక్ మరింత టఫ్‌గా జరిగేదని అభిమానులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. కాగా.. గాయపడి జట్టుకు దూరమైన వసీమ్ జూనియర్ స్థానంలో సీనియర్ పేసర్ హసన్ అలీని పాకిస్థాన్ జట్టులోకి తీసుకుంది. గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌లో హసన్ అలీ పాక్ జట్టులో ఉన్నాడు. ఆ మ్యాచ్‌లో హసన్ అలీ 4 ఓవర్లు వేసి 44 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. సూర్యకుమార్ యాదవ్, జడేజాను అవుట్ చేసి టీమిండియా దెబ్బతీశాడు. కానీ.. ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన జట్టులో హసన్ అలీకి చోటు దక్కలేదు. ఇప్పుడు అనూహ్యంగా వసీమ్ జూనియర్ గాయపడటంతో హసన్ అలీ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇకపోతే టీ20 వరల్డ్ కప్‌లో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకోవాలని టీమిండియా దృఢ నిశ్చయంతో ఉంది. అలాగే పాకిస్థాన్ కూడా ఆ విక్టరీ టెంపోను కొనసాగించాలని భావిస్తోంది. ఇక ఓవరాల్‌గా ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై భారత్‌దే పైచేయిగా ఉంటుంది. టీమిండియా ఇప్పటికే 7 సార్లు ఆసియా కప్ ఛాంపియన్‌గా నిలిచింది. పాకిస్థాన్ రెండుసార్లు మాత్రమే ఆసియా కప్ గెలిచింది. ఇలా గత ట్రాక్ రికార్డు చూసుకుంటే ఆదివారం మ్యాచ్‌లో టీమిండియానే హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు సైతం నెట్స్‌లో గట్టిగానే ప్రాక్టీస్ చేస్తున్నారు. మరి ఈ దాయాదుల పోరులో ఎవరి విజయావకాశాలు ఎలా ఉన్నాయి? వసీమ్ జానియర్ స్థానంలో హసన్ అలీని జట్టులోకి తీసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: ఎవరికి భయపడని నేను.. అతని కోపానికి మాత్రం వణికిపోతా: రిషభ్ పంత్ In another injury setback for Pakistan, Mohamad Wasim has been ruled out of the #AsiaCup He had pulled up with back pain during training in Dubai pic.twitter.com/bey4fkmBxT — ESPNcricinfo (@ESPNcricinfo) August 26, 2022 Hasan Ali named as Wasim Jr's replacement Best of luck @RealHa55an #AsiaCup2022 pic.twitter.com/Us0te8R1bW — Cricket Pakistan (@cricketpakcompk) August 26, 2022