ఆసియా కప్‌లో భాగంగా రేపు(ఆదివారం ఆగస్ట్ 28) జరగబోయే ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌పై ఎంతైతే హై ఉందో.. అదే రేంజ్లో విరాట్ కోహ్లీ ఎలా ఆడుతాడో అనే దానిపై అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఎందుకంటే కోహ్లీ చాలా కాలంగా సరైన ఫామ్‌లో లేడు. ఇంగ్లండ్ టూర్ తర్వాత లాంగ్ రెస్ట్ తీసుకున్న కోహ్లీ తిరిగి ఆసియా కప్‌తోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. దీనికంటే ముందు వెస్టిండీస్‌తో మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌కు, జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌కు విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ.. అంతకంటే ముందు నుంచే కోహ్లీ ఫామ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. సెంచరీలను మంచినీళ్ల ప్రాయంలా కొట్టే కోహ్లీ.. మూడంకెల స్కోర్ చేసి దాదాపు మూడేళ్లు అవుతుంది. దీంతో కోహ్లీ ఆసియా కప్‌లో ఎలాంటి ప్రదర్శన ఇస్తాడో అని క్రికెట్ లోకం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో తాను ఎలాంటి అప్రోచ్‌తో బ్యాటింగ్ చేస్తానో.. ఇప్పుడు తన ఫామ్ ఎందుకు ఇలా ఉందనే విషయాలపై కోహ్లీ స్పందించాడు. కోహ్లీ మాట్లాడుతూ..‘నేను ఉదయం లేచిన తర్వాత ఆ డేను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటా. ఆ రోజులో ఎలాంటి ఛాలెంజ్ ఎదురైన స్వీకరించేందుకు ఉత్సాహంగా ఉంటా. అలాగే నా జీవితంలో గడిచే ప్రతిరోజును ప్రతిక్షణాన్ని సంతోషంగా ఆస్వాదిస్తా. ఫీల్డ్‌లో ఇలా ఉండటం నీకు ఎలా సాధ్యమవుతుందని చాలా మంది అడుగుతుంటారు. వారందరికి నేను చెప్పేది ఒక్కటే.. నేను ఆటను ప్రేమిస్తాను. అలాగే గ్రౌండ్లో దిగిన తర్వాత ప్రతి బంతిపై వందశాతం ఎఫర్ట్ పెడతాను. అలా ఉండటం నాకు అసహజంగా అనిపించలేదు. ఇలా ఎలా ఉండగలుగుతున్నావ్ అంటూ ఇతర జట్ల ఆటగాళ్లు కూడా నన్ను అడుగుతుంటారు. ఏది ఏమైనా నా టీమ్ గెలవాలని నేను కోరుకుంటాను అందుకే ప్రతిక్షణం ఉత్సహంగా ఉంటాను. అందుకే ప్రతిసారి నేనెంతో ఎనర్జీగా ఉంటాను. ఇదంతా నేచురల్‌గా జరుగుతుంది. కానీ.. కొంత కాలంగా అది మిస్ అవుతుంది. నేను బలవంతంగా నన్ను నేను ఫుష్ చేయాల్సి వస్తుంది.’ అని కోహ్లీ వెల్లడించాడు. ఆటను ఎంతగానో ప్రేమించే కోహ్లీ.. మైదానంలో ఎప్పుడూ లోడ్ చేసిన గన్లా ఉంటాడు. బ్యాటింగ్‌లో పరుగులు చేయకున్నా.. ఫీల్డింగ్‌లో ఆ ప్రభావం పడనియడు. కెప్టెన్‌గా జట్టును ఎలా నడిపించాడో.. ఆటగాడిగా ఉన్న కోహ్లీలో ఏమాత్రం జోష్ తగ్గలేదు. మ్యాచ్‌లో ప్రాణం పెట్టి ఆడతాడు కనుకే కోహ్లీ అంత ఎనర్జీతో ఉంటాడు. కోహ్లీ అగ్రెసివ్ అప్రోచ్ జట్టు మొత్తానికి ఎనర్జీ ఇస్తుంది. కానీ.. కొంత కాలం కోహ్లీ ఎనర్జీలో ఎలాంటి మార్పు లేనప్పటికీ.. బ్యాటింగ్‌లో మాత్రం స్థాయికి తగ్గట్టు రాణించలేకపోతున్నాడు. అందుకు కారణం తనలో ఉండే సహజమైన గుణం ఏదో మిస్ అవుతున్నట్లు కోహ్లీ వెల్లడించాడు. బాగా ఆడాలి అని అనుకుంటేనే అద్భుతంగా బ్యాటింగ్ చేసే కోహ్లీ.. కొంతకాలం నుంచి ఈ మ్యాచ్‌లో కచ్చితంగా పెద్ద స్కోర్ చేయాలని బరిలోకి దిగి విఫలం అవుతున్నాడు. తనను తాను బలవంతంగా పుష్ చేస్తున్నట్లు కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్లో వరుసగా డకౌట్లు అయిన సమయంలో కోహ్లీ క్రీజ్‌లోనే ఫేస్ డల్‌గా పెట్టి.. గుండె బరువెక్కినప్పుడు నవ్వే నవ్వును నవ్వాడు. అభిమానులు కోహ్లీని గతంలో ఎప్పుడు అలా చూడలేదు. దీంతో కోహ్లీ ఒత్తిడికి గురవుతున్నట్లు అంతా భావించారు. మరి ఆసియా కప్‌తో నైనా కోహ్లీ ఫామ్‌లోకి వస్తాడని ఆశిద్దాం. ఎందుకంటే పాకిస్థాన్‌పై కోహ్లీకి మంచి రికార్డు ఉంది. గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో పాక్ జరిగిన లీగ్ మ్యాచ్‌లో పాక్బౌలింగ్ ముందు జట్టు మొత్తం తలొంచినా.. కోహ్లీ ఒక్కడే హాఫ్ సెంచరీతో సమర్థవంతంగా ఎదుర్కొని నిలిచాడు. ఇప్పుడు మళ్లీ లాంగ్ గ్యాప్ తర్వాత పాక్‌పైనే రీ ఎంట్రీ ఇస్తుండడంతో కోహ్లీ తిరిగి ఫామ్ అందుకుంటాడని అతని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్లరూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: ఎవరికి భయపడని నేను.. అతని కోపానికి మాత్రం వణికిపోతా: రిషభ్ పంత్ Up close and personal with @imVkohli! Coming back from a break, Virat Kohli speaks about the introspection, the realisation and his way forward! Full interview coming up on https://t.co/Z3MPyeKtDz Watch this space for more ⌛️ #TeamIndia | #AsiaCup2022 | #AsiaCup pic.twitter.com/fzZS2XH1r1 — BCCI (@BCCI) August 27, 2022