రన్ మెషిన్ విరాట్ కోహ్లీ మరో అద్భుతమైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. కేప్ టౌన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ రాణించిన కోహ్లీ ఏకంగా టీమిండియా మోస్ట్ సెక్సెస్‌ఫుల్ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రికార్డును బద్దలు కొట్టి ఆసియా నుంచే నంబర్ వన్ కెప్టెన్‌గా నిలబడ్డాడు.
ఈ రికార్డు మూడు ఫార్మాట్లలో అత్యధిక పరుగులు చేసిన ఆసియా కెప్టెన్‌తో ముడిపడి ఉంది. సౌరవ్ గంగూలీ దక్షిణాఫ్రికా గడ్డపై క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో కలిపి 911 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఈ రికార్డును విరాట్ కోహ్లీ తుడిచేశాడు. ఆఫ్రికన్ గడ్డపై విరాట్ ఇప్పుడు అన్ని ఫార్మాట్లలో కలిపి 1003 పరుగులు పూర్తి చేశాడు. ఈ సందర్భంలో, విరాట్, గంగూలీ తర్వాత, శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ దక్షిణాఫ్రికాలో 674 పరుగులు చేసి మూడో స్థానంలో ఉన్నాడు.
ఆ తర్వాత, 637 పరుగులు చేసిన శ్రీలంక మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య నాలుగో స్థానంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికాలో అన్ని ఫార్మాట్లలో కలిపి ధోనీ 592 పరుగులు చేశాడు. అక్కడ అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్ల జాబితాలో ధోని 5వ స్థానంలో ఉన్నాడు. మరి విరాట్ సాధించిన ఈ రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: రాహుల్ ద్రవిడ్ స్థానాన్ని ఆక్రమించుకున్న విరాట్ కోహ్లీ