సురేశ్ రైనా.. ఈ పేరుకు క్రికెట్ లో పెద్ద చరిత్రే ఉంది. ముఖ్యంగా టీ20ల్లో రైనాకు మంచి రికార్డులే ఉన్నాయి. ఐపీఎల్ విషయానికి వస్తే చెన్నై జట్టుకు ధోనీ తర్వాత సురైశ్ రైనానే మెయిన్ ప్లేయర్ గా కొనసాగాడు. చిన్న తాలాగా కూడా గుర్తింపు పొందాడు. కానీ, అలాంటి రైనాకు ఐపీఎల్ 2022 మెగా వేలంలో జరిగిన అవమానం అందరికీ తెలిసిందే. అతను అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాలో ఉండిపోయాడు. అతడిని దక్కించుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. చెన్నై కూడా ఇంట్రస్ట్ చూపకపోవడం అభిమానులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. అతంటి అవమానం ఎదుర్కొన్న రైనాకు అరుదైన గౌరవం దక్కింది.
ఇదీ చదవండి: చెన్నై సూపర్ కింగ్స్ కు షాక్! మొదటి మ్యాచ్ కు స్టార్ ఆల్ రౌండర్ దూరం!
మాల్దీవులు ప్రభుత్వం ఇచ్చే స్పోర్ట్స్ ఐకాన్ అవార్డుకు ఎంపికయ్యాడు. మొత్తం వివిధ దేశాలకు చెందిన 16 మంది క్రీడాకారులు నామినేట్ అయ్యారు. మాజీ రియల్ మాడ్రిడ్ ఫుట్ బాల్ ఆటగాడు రాబర్ట్ కార్లోస్, జమైకన్ స్పింటర్ అసఫా పావెల్, శ్రీలంక మాజీ క్రికెటర్ జయసూర్య ఇలా మొత్తం 16 మంది ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు. సురేశ్ రైనా తన కెరీర్ లో క్రికెట్ కు చేసిన సేవకు గుర్తుగా ఈ అవార్డు ఇస్తున్నట్లు మాల్దీవ్స్ ప్రభుత్వం వెల్లడించింది. సురేశ్ రైనాకు దక్కిన గౌరవంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.