సొంతగడ్డపై శ్రీలంక.. ఆస్ట్రేలియా టీమ్‌ను మట్టికరిపించింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత సొంత గడ్డమీద ద్వైపాక్షిక సిరీస్ లో ఆస్ట్రేలియాపై నెగ్గి శ్రీలంక చరిత్ర సృష్టించింది. ఐదు వన్డేల సిరీస్ ను శ్రీలంక 3-1 తేడాతో ఇంకో మ్యాచ్ మిగిలుండగానే సొంతం చేసుకుంది. తొలి మ్యాచ్ ఓడిన తర్వాత వరుసగా మూడు వన్డేల్లో శ్రీలంక విజయం సాధించింది. రణతుంగ, జయసూర్య, కుమార సంగక్కర వంటి దిగ్గజ క్రికెటర్ల వల్ల కానిది.. కుర్రాళ్లు సాధించి చూపించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49 ఓవర్లలో 258 పరుగలకు ఆలౌటైంది. అసలంక 106 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్ సాయంతో 110 పరుగులతో చెలరేగాడు. 259 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా కేవలం 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 50 ఓవర్లలో 254 పరుగులకు పది వికెట్లు కోల్పోయింది. డేవిడ్ వార్నర్ 99 పరుగుల వద్ద ఔట్ అవ్వడమే ఆస్ట్రేలియాకు శాపంగా మారింది. వార్నర్ కనీసం ఇంకా రెండు బంతులు ఆడున్నా కూడా.. ఆస్ట్రేలియా విజయం సాధించేదంటూ నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. కమిన్స్(35), ట్రావిస్ హెడ్(27), మిచెల్ మార్ష్(26) మినహా ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేదు. శ్రీలంక బౌలింగ్ విషయానికి వస్తే.. కరుణరత్నే, హసరంగ, వాండర్ సే తలా 2 వికెట్లు పడగొట్టారు. Sri Lanka hold their nerves to take an unassailable 3-1 series lead They beat Australia by 4 runs in the fourth ODI in Colombo! Watch the #SLvAUS series on https://t.co/WngPr0Ns1J (in select regions) Scorecard: https://t.co/KsvSxzgG3U pic.twitter.com/ykSQ7Xt9DN — ICC (@ICC) June 21, 2022 అటు శ్రీలంక, ఇటు ఆస్ట్రేలియా ఇరు జట్లలో బ్యాటింగ్ పరంగా కేవలం ఒక్క ప్లేయర్ చేసిన పరుగులే అధికం అని చెప్పాలి. శ్రీలంక టీమ్‌లో అసలంక(110) శతకంతో ఆకట్టుకోగా.. వార్నర్ 99 పరుగులు చేశాడు. ఇరు జట్లలోనూ వారిద్దరి కన్నా మరెవరూ అంతగా ఆకట్టుకోలేకపోయారు. తాజా విజయంతో శ్రీలంక ఇంకో మ్యాచ్ మిగిలుండగానే ఆస్ట్రేలియాపై సిరీస్‌ను సొంతం చేసుకుంది. 2012 తర్వాత ఆస్ట్రేలియాపై శ్రీలంక వరుసగా మూడు వన్డేలు గెలవడం కూడా ఇదే తొలిసారి కావడం విశేషం. శ్రీలంక సాధించిన విజయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. 30 years of heartbreaks, but Sri Lanka finally have an ODI series win over Australia#SLvAUS pic.twitter.com/v4HKbEzHFx — ESPNcricinfo (@ESPNcricinfo) June 22, 2022 The crowd goes wild in Colombo as beat by 4 runs to seal the #AUSvSL series! pic.twitter.com/HXmIYmooLc — Sri Lanka Cricket (@OfficialSLC) June 21, 2022 That victory feeling #SLvAUS #CheerForLions pic.twitter.com/9EWa4H4eQl — Sri Lanka Cricket (@OfficialSLC) June 21, 2022 ఇదీ చదవండి: భారత్‌పై మరోసారి తమ అక్కసు వెళ్లగక్కిన పాక్ ప్లేయర్ షాహిద్ అఫ్రిది! ఇదీ చదవండి: పాకిస్తాన్ సూపర్ లీగ్ లో తాను అనుభవించిన చీకటి రోజులను బయటపెట్టిన జేసన్ రాయ్!